చెన్నై… ఛలో హైదరాబాద్.!

ఐపీఎల్ 12వ సీజన్‌ ఫైనల్ కు చెన్నై దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్ 2లో ఢిల్లీ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బౌలర్లు దీపక్‌ చాహర్‌ (2/28), బ్రావో (2/19), జడేజా (2/23), హర్భజన్‌ (2/31) దెబ్బకు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిషబ్‌ పంత్‌ (38; 25 బంతుల్లో 2×4, 1×6) టాప్‌ స్కోరర్‌. […]

చెన్నై... ఛలో హైదరాబాద్.!
Follow us

|

Updated on: May 11, 2019 | 6:32 AM

ఐపీఎల్ 12వ సీజన్‌ ఫైనల్ కు చెన్నై దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్ 2లో ఢిల్లీ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బౌలర్లు దీపక్‌ చాహర్‌ (2/28), బ్రావో (2/19), జడేజా (2/23), హర్భజన్‌ (2/31) దెబ్బకు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిషబ్‌ పంత్‌ (38; 25 బంతుల్లో 2×4, 1×6) టాప్‌ స్కోరర్‌.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఓపెనర్లు వాట్సన్‌ (50; 32 బంతుల్లో 3×4, 4×6), డుప్లెసిస్‌ (50; 39 బంతుల్లో 7×4, 1×6) రెచ్చిపోవడంతో లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించింది. ఇక రేపు హైదరాబాద్‌లో జరగబోయే ఫైనల్‌లో చెన్నై, ముంబై తలపడనున్నారు.