ఈ మొక్కను తాకితే మీ పని అయిపోయినట్టే.?
TV9 Telugu
07 May 2024
మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి గింపి-గింపి మొక్కలు. వీటి ఆకుని పొరపాటున కూడా తాకిన భయంకరమైన నొప్పి వస్తుందట.
ఈ నొప్పిని భరించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అనే ఫీలింగ్ కూడా వస్తుందట. ఈ మొక్కలు ఆస్ట్రేలియా దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.
గింపీ-గింపీ ముళ్ల మొక్క గురించి తెలియక పూర్వం ఈ మొక్కని తాకితే శపిస్తుంది అందుకే ఇంత భయంకరమైన నొప్పి గిరిజనలు అనుకునేవారు.
ఈ మొక్క ఆకులు రావి ఆకులను పోలి ఉంటాయి, ఆకులపై సన్నటి ముల్లు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే తేలు కుడితే ఎలాంటి నొప్పి కలిగేంత నొప్పు వస్తుంది.
ముఖ్యంగా ఈ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత రెండు గంటలపాటు వచ్చే నొప్పిని భరించడం కంటే మరణం మేలు అనిపిస్తుంది.
ఈ ముళ్ళు శరీరంలో ఉన్నంతసేపు ఆ నొప్పి తగ్గనే తగ్గదు. ముళ్ళు శరీరం నుంచి తీసేసిన అనంతరం కూడా ఆ నొప్పి చాలా సంవత్సరాల పాటు ఉంటుందట.
అందుకనే ఈ గింపీ గింపీ మొక్కని ప్రపంచంలోని భయంకరమైన మొక్కల్లో ఒకటి అని పరిశోధకులు చెబుతారు. ఈ మొక్క సైంటిఫిక్ పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడెస్.
అందుకే ఈ మొక్క కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. రావి అనుకోని ముట్టుకొనే నెప్పిని భరించడం చాల కష్టం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి