ఇంత బ్యాడ్ లక్ ఏంటి.. ఒక్క బంతి ఆడకుండానే ఔట్.. ఆ టీం ఏదో తెలుసా?

Asian Games: ఆసియా క్రీడలు (Asian Games) క్రికెట్ పోటీల్లో చైనా మహిళల జట్టుకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ చిత్తడి మైదానం కారణంగా రద్దవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే చైనా టోర్నీ నిష్క్రమించింది. మెరుగైన అంతర్జాతీయ ర్యాంకింగ్ ఆధిక్యంతో బంగ్లాదేశ్ నేరుగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఇంత బ్యాడ్ లక్ ఏంటి.. ఒక్క బంతి ఆడకుండానే ఔట్.. ఆ టీం ఏదో తెలుసా?
China Womens Cricket Team

Updated on: Sep 17, 2026 | 3:25 PM

China Womens Cricket Team: ఆసియా గేమ్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో క్రికెట్ పోటీలు కూడా షురూ అయ్యాయి. ఆసియా గేమ్స్ మొదలుకాకముందే లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కేవలం క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్ మాత్రమే ఆసియా గేమ్స్‌లో నిర్వహించనున్నారు. అంతకుముందు లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేయనున్నారు. ఈక్రమంలో లీగ్ మ్యాచ్‌ల్లో ఓ వింత చోటు చేసుకుంది. ఒక్క మ్యాచ్ ఆడకుండా, కనీసం ఒక్క బంతి కూడా వేయకుండానే ఓ జట్టు ఆసియా గేమ్స్ నుంచి తప్పుకుంది. వినడానికి వింతగా ఉన్నా, ఇది 100 శాతం నిజం. ఆవివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఐచి ప్రిఫెక్చర్‌లోని నిస్సిన్ సిటీ పరిధిలో గల కరోగీ స్పోర్ట్స్ పార్క్ (Karogi Sports Park) వేదికగా చైనా (China) వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్ల (Bangladesh women’s cricket team) మధ్య క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మైదానం బాగా తడిగా ఉండటంతో టాస్ కూడా వేయడానికి వీలుపడలేదు. అంపైర్లు పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆట సాధ్యం కాదని తేల్చి మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ 10వ స్థానంలో ఉండగా, చైనా జట్టు 36వ ర్యాంకులో కొనసాగుతోంది. ఐసీసీ తాజా నిబంధనల ప్రకారం మెరుగైన ర్యాంకు కలిగి ఉన్న జట్టుకే తదుపరి రౌండ్ అవకాశం దక్కుతుంది. ఈ లెక్కన బంగ్లాదేశ్ ముందంజ వేయగా, చైనా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

ఎక్కువమంది చదివినది: రోహిత్ ఇన్.. పంత్‌ ఔట్.. వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు.. ఇద్దరు కొత్తోళ్లకు చోటు!

నేపాల్‌పై అద్భుత విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న చైనా జట్టుకు ఈ పరిణామం తీరని నిరాశను మిగిల్చింది. మైదానంలో తమ సత్తా చాటే అవకాశం కూడా రాకుండా టోర్నీని ముగించాల్సి రావడం చైనా శిబిరాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. మొత్తం ఎనిమిది జట్లతో సాగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే చైనా నిష్క్రమణ ఖరారైంది.

ఎక్కువమంది చదివినది: ఆఖరి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి నిరాశేనా..? శాంసన్ మాటలతో ఫుల్ క్లారిటీ..!

సెమీస్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ సెప్టెంబర్ 20న జరిగే పోరులో తలపడనుంది. శుక్రవారం జరగబోయే భారత్ (India), జపాన్ (Japan) జట్ల క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ విజేతతో బంగ్లాదేశ్ సెమీఫైనల్లో ఢీకొంటుంది. మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నాయకత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సెమీస్ సమరంలో బంగ్లాదేశ్‌తో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలేందుకు అందరి దృష్టీ భారత్, జపాన్ మ్యాచ్‌పైనే నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us