ఇవాళ్టి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫలితాలు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేయనున్నాయి. నవంబర్ 2019 తర్వాత టీమిండియాకు ఇది తొలి హోం సిరీస్ కావడం విశేషం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టెస్ట్ సిరీస్ వాయిదా పడటంతో.. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ చేరుకోగా.. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ మరో ఫైనలిస్ట్‌ను ఖరారు చేయనుంది. ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి చెన్నై వేదికగా రెండు టీమ్స్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
చెన్నై పిచ్ స్పిన్నర్స్‌కు స్వర్గధామ. ఈ పిచ్‌లో చివరిగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 759/7 డిక్లేర్(2016లో) భారీ స్కోర్ సాధించగా.. టీమిండియా గెలుపులో రవీంద్ర జడేజా ఏడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. చెన్నైలో ఐదు రోజులు పొడి, తేమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట స్థాయి 21-22 డిగ్రీలు.. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండొచ్చు. అలాగే మ్యాచ్ చివరి రెండు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్ ప్రకారమే..
టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!