CSK Vs SRH: పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుపు..

|

May 02, 2022 | 12:00 AM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌(SRH)పై చెన్నై(CSK) 13 పరుగుల తేడాతో విజయం సాధించింది...

CSK Vs SRH: పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుపు..
Csk
Follow us on

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌(SRH)పై చెన్నై(CSK) 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ 189/6 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. నికోలస్‌ పూరన్‌ 64 పరుగులతో నాటౌట్‌గా నిలువగా, కేన్‌ విలియమ్సన్‌ 47, అభిషేక్ శర్మ 39 పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠి డకౌట్‌ కాగా.. మార్‌క్రమ్ 17, శశాంక్‌ 15, వాషింగ్టన్‌ సుందర్‌ 2 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ముకేశ్‌ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిచెల్‌ సాంట్నర్‌, డ్వేన్ ప్రిటోరియస్‌ చెరో వికెట్‌ తీశారు.

చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ 99 పరుగులు చేయగా డేవన్‌ కాన్వే 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోనీ 8, జడేజా ఒక పరుగు చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​​ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్​కు 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోర్​ సాధించేందుకు బాటలు వేశారు. ఈ క్రమంలో రుతురాజ్‌ కాస్తలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ సీజన్​లో ఓపెనర్లు సాధించిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. రవీంద్ర జడేజా నుంచి జట్టు బాధ్యతలను అందుకున్న తర్వాత చెన్నైకి ధోనీ తొలి విజయం అందించడం విశేషం.

Read Also.. Virat Kohli: కింగ్ కోహ్లీ అర్ధసెంచరీ.. గ్యాలరీలో అనుష్క సంబరాలు మాములుగా లేవుగా..