ఈ ఫొటోలో ఉన్నది సినిమా సెలబ్రెటీ కాదు గురూ.. స్టార్ క్రికెటర్ ఎవరో కనిపెట్టండి చూద్దాం..!

|

Feb 17, 2023 | 7:01 PM

పై ఫొటోలో ఉన్న సినిమా తారలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. పైన కనిపిస్తోన్న పిక్ లో ఉంది ఒక స్టార్ క్రికెటర్. గ్రౌండ్ లో అడుగు పెడితే బాల బౌండ్రీ దాటాల్సిందే..

ఈ ఫొటోలో ఉన్నది సినిమా సెలబ్రెటీ కాదు గురూ.. స్టార్ క్రికెటర్ ఎవరో కనిపెట్టండి చూద్దాం..!
Cricketer
Follow us on

సెలబ్రెటీలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. నిత్యం ఎదో ఒక సెలబ్రెటీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. కానీ తాజాగా పైన కనిపిస్తోన్న ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ఉన్న సినిమా తారలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. పైన కనిపిస్తోన్న పిక్ లో ఉంది ఒక స్టార్ క్రికెటర్. గ్రౌండ్ లో అడుగు పెడితే బాల బౌండ్రీ దాటాల్సిందే.. క్రికెట్ లో సరి కొత్త చరిత్ర సృష్టించాడు పై ఫొటోలో ఉన్న పిల్లాడు. ఇంతకు ఆ బుడతడు ఎవరో గుర్తుపట్టారా..? తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. క్రికెటర్ గానే కాదు.. హ్యాండ్సమ్ ప్లేయర్ గా.. అమ్మాయిలా కలల రాకుమారిడిగా మారాడు కూడా.. ఇంతకు అతను ఎవరో కనిపెట్టారా..?

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారుల్లో ఉన్న స్టార్ క్రికెటర్ ఎవరో కాదు ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్స్ లో ఒకరైన యువరాజ్ సింగ్. పైన కనిపిస్తోన్న ఫొటోలో వైట్ కలర్ షర్ట్ వేసుకొని పెట్టుడు మీసం తో కనిపిస్తున్నాడు యువరాజ్. స్కూల్ లో జరిగిన ఒక నాటకంలో ఇలా గెటప్ వేశాడు. ఇక ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ తనదైన ఆట తీరుతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు బాల్స్ కు ఆరు సిక్స్ లు కొట్టి అందరిని ఆకట్టుకున్నాడు.

2012లో యువరాజ్‌కు భారత ప్రభుత్వం  రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డు అందించింది. అలాగే  2014లో పద్మశ్రీని అందుకున్నాడు. యువరాజ్ 10 జూన్ 2019న, యువరాజ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Yuvraj Singh