Jasprit Bumrah: ఫాస్ట్‌ బౌలర్‌ స్పిన్‌ బౌలర్‌గా మారితే… వైరల్‌ అవుతోన్న బుమ్రా బౌలింగ్‌ వీడియో..

Bumrah Spin Bowling Video: జస్ప్రీత్‌ బుమ్రా అంటే తొలుత గుర్తొచ్చేది ఆయన ఫాస్ట్‌ బౌలింగ్‌. ఈ బౌలర్‌ వేసే బంతులు వేగంగా దూసుకెళుతుంటే ప్రత్యర్థులు భయపడాల్సిందే. అయితే తాజాగా ఈ ఫాస్ట్ బౌలర్‌ స్పిన్‌ బౌలింగ్‌...

Jasprit Bumrah: ఫాస్ట్‌ బౌలర్‌ స్పిన్‌ బౌలర్‌గా మారితే... వైరల్‌ అవుతోన్న బుమ్రా బౌలింగ్‌ వీడియో..

Updated on: Jan 31, 2021 | 7:47 PM

Bumrah Spin Bowling Video: జస్ప్రీత్‌ బుమ్రా అంటే తొలుత గుర్తొచ్చేది ఆయన ఫాస్ట్‌ బౌలింగ్‌. ఈ బౌలర్‌ వేసే బంతులు వేగంగా దూసుకెళుతుంటే ప్రత్యర్థులు భయపడాల్సిందే. అయితే తాజాగా ఈ ఫాస్ట్ బౌలర్‌ స్పిన్‌ బౌలింగ్‌ వేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. టీమిండియా పేసర్‌ జస్పీత్‌ బుమ్రా తాజాగా నెట్స్‌లో స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేను అనుకరిస్తూ బౌలింగ్‌ ప్రాక్టిస్‌ చేస్తున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోతో పాటు.. ‘బుమ్రా యార్కర్లు, బౌన్సర్లు మనం చూశాం. అయితే ఇప్పటివరకు ఫాస్ట్‌ బౌలర్లు అనుసరించని విధంగా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. లెజెండ్‌ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తున్నాడు’ అంటూ క్యాప్షన్‌ జోడించింది.

ఇక బీసీసీఐ పోస్ట్‌ చేసిన ఈ పోస్ట్‌పై అనిల్‌ కుంబ్లే స్పందించాడు. ‘చాలా బాగా చేశావ్‌ బుమ్రా. అచ్చంగా నాలాగే బౌలింగ్ చేస్తున్నావు. నీ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తున్న ఎంతో మంది యువ బౌలర్లకు.. నువ్వు స్ఫూర్తి. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో రాణించాలని కోరుకుంటున్నా’ అంటూ కామెంట్‌ రాసుకొచ్చాడు.

Also Read: Team India: మొక్కు తీర్చుకున్న టీమిండియా ప్లేయర్.. సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు సమర్పణ..