Video: సిగ్నేచర్ స్టెప్‌లో ఏకంగా ‘కింగ్ ఖాన్‌’తోనే పోటీ పడిన ఆస్ట్రేలియా లేడీ ప్లేయర్స్.. బెంగళూరులో రచ్చో రచ్చ

Womens Premier League 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈరోజు ప్రారంభమయ్యే టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మాత్రమే జరుగుతాయి. కాగా, ఫైనల్ మార్చి 17న ఢిల్లీలో జరగనుంది. గతేడాది మొత్తం సీజన్‌ను ముంబైలో నిర్వహించగా, ఈసారి అక్కడ ఒక్క మ్యాచ్ కూడా జరగడంలేదు.

Video: సిగ్నేచర్ స్టెప్‌లో ఏకంగా 'కింగ్ ఖాన్‌'తోనే పోటీ పడిన ఆస్ట్రేలియా లేడీ ప్లేయర్స్.. బెంగళూరులో రచ్చో రచ్చ
Meg Lanning, Shahrukh Khan
Follow us

|

Updated on: Feb 23, 2024 | 3:34 PM

Women’s Premier League 2024: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభ పోరుకు రంగం సిద్ధమైంది. భారత బాలీవుడ్ దిగ్గజం, షారుక్ ఖాన్ గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ షారుఖ్ ఖాన్ నుంచి సిగ్నేచర్ స్టెప్‌ను నేర్చుకుంది. ఈ మేరకు వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

WPL సీజన్ 2 కి బెంగళూరు, ఢిల్లీ వేదికలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇంకా కొన్ని గంటల్లో ఎం. చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభ గేమ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి.

ప్రారంభ పోరుకు ముందు, మెగ్ లానింగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌తో కలిసి సరదాగా గడిపారు. అతను స్టేడియంను సందర్శించి, టోర్నమెంట్ కోసం ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపాడు.

గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మెగ్ లానింగ్, ఆటలో దిగ్గజం కంటే తక్కువ కాదు. ఆమె ఆస్ట్రేలియన్ జట్టుకు బ్యాట్‌తో సహకరించడమే కాకుండా అనేక ICC టైటిళ్లకు జట్టును నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది మహిళల క్రికెట్ చరిత్రలో ఆమెను అత్యుత్తమ కెప్టెన్‌గా మార్చింది.

ఈ క్రమంలో షారుఖ్ ఖాన్, ఈ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్‌ చెంతకు చేరుకున్నాడు. మెగ్ లానింగ్ ఈ బాలీవుడ్ నటుడితో చాలా సరదాగా కనిపించింది. అయితే, షారుక్ ఖాన్ తన సిగ్నేచర్ భంగిమను ఆమెకు నేర్పించాడు. దీంతో ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ షారుఖ్ సిగ్నేచర్ భంగిమను చేసి చూపించి, నవ్వులు పూయించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు, షారుక్ ముంబై ఇండియన్స్ జట్టును కూడా కలిసి, శుభాకాంక్షలు తెలిపాడు.

స్క్వాడ్‌లు:

ముంబై ఇండియన్స్ మహిళా జట్టు: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్, జింటిమణి కలిత, అమన్‌దీప్ కౌర్, సైకా ఇషాక్, హుమైరా, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, ప్రియాంక బాల, ఎస్ సజన, కీర్తన బాలకృష్ణన్, ఫాతిమా జాఫర్.

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టు: షఫాలీ వర్మ, మెగ్ లానింగ్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, అలిస్ క్యాప్సే, అన్నాబెల్ సదర్లాండ్, శిఖా పాండే, తానియా భాటియా(కీపర్), రాధా యాదవ్, పూనమ్ యాదవ్, టిటాస్ సాధు, మిన్ను మణి, జెస్ జోనాస్ లారా హారిస్, అరుంధతి రెడ్డి, అశ్వని కుమారి, అపర్ణ మోండల్, స్నేహ దీప్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్