Next IPL : ఐపీఎల్ 2021  ప్రత్యామ్నాయ వేదికపై బీసీసీఐ కీలక ప్రకటన.. యూఏఈ కన్నా భారతే భద్రమైనది..

|

Jan 30, 2021 | 9:48 PM

ఐపీఎల్ 2021 నిర్వాహనపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ప్రత్యామ్నాయ వేదికను వెతికే అవసరం లేదని పేర్కొంది. భారత్​లో పరిస్థితులు మెరుగవుతాయని నమ్ముతున్నట్లు తెలిపింది.

Next IPL : ఐపీఎల్ 2021  ప్రత్యామ్నాయ వేదికపై బీసీసీఐ కీలక ప్రకటన.. యూఏఈ కన్నా భారతే భద్రమైనది..
Follow us on

Next IPL : ఐపీఎల్ 2021 నిర్వాహనపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ప్రత్యామ్నాయ వేదికను వెతికే అవసరం లేదని పేర్కొంది. భారత్​లో పరిస్థితులు మెరుగవుతాయని నమ్ముతున్నట్లు తెలిపింది.

ప్రస్తుతానికి భారత్ వెలుపల ప్రత్యామ్నాయ వేదిక కోసం చూడాల్సిన అవసరం లేదని సంస్థ భావిస్తోందని బీసీసీ బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్​

కోవిడ్ వేళ గతేడాది లీగ్​ను యూఏఈలో నిర్వహించగా.. ఈ సారి భారత్​లోనే నిర్వహిస్తామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్​ ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్​ను భారత్​లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదే నమ్మకంతో ఉన్నామని అన్నారు. అందుకే ప్రత్యామ్నాయ వేదిక గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి యూఏఈ కన్నా భారతే భద్రమైనదని తెలిపారు. పరిస్థితులు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నామని ధుమాల్ తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే మైదానాల్లోకి 25-50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Myntra to Change Logo : మహిళ ఇచ్చిన షాక్‌తో లోగోనే మార్చేసుకున్న ఈ-కామర్స్ దిగ్గజం

ఎస్ఈసీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. విధులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నామని వెల్లడి