Ben Stokes Face Injury: స్టార్ ప్లేయర్‎కు గాయం.. గుర్తు పట్టలేనంతగా రక్తం తడిసిపోయిన ముఖం.. అసలేమైంది ?

Ben Stokes Face Injury: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన తన అద్భుతమైన ఆటతో కాకుండా, ముఖానికి తగిలిన ఒక భయంకరమైన గాయం వల్ల చర్చనీయాంశమయ్యారు. స్టోక్స్ ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Ben Stokes Face Injury:  స్టార్ ప్లేయర్‎కు గాయం.. గుర్తు పట్టలేనంతగా రక్తం తడిసిపోయిన ముఖం.. అసలేమైంది ?
Ben Stokes Face Injury

Updated on: Feb 05, 2026 | 8:36 PM

Ben Stokes Face Injury: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన తన అద్భుతమైన ఆటతో కాకుండా, ముఖానికి తగిలిన ఒక భయంకరమైన గాయం వల్ల చర్చనీయాంశమయ్యారు. స్టోక్స్ ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఫోటోలో ఆయన ముఖం చాలా దారుణంగా తయారైంది. కంటి కింద లోతైన నల్లటి మచ్చ, బుగ్గపై ఎర్రటి గాయాలు, ముక్కు కింద రక్తపు గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోతో పాటు ఆయన ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. “మీరు ఆ క్రికెట్ బంతి పరిస్థితిని కూడా చూడాలి” అంటూ పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే ప్రాక్టీస్ సెషన్‌లోనో లేదా మ్యాచ్ సమయంలోనో క్రికెట్ బంతి బలంగా ఆయన ముఖానికి తగిలినట్లు అర్థమవుతోంది. ఒక్క అంగుళం అటు ఇటుగా ఉన్నా ఆయన కంటికి తీవ్రమైన నష్టం జరిగేదని, అది ఆయన కెరీర్‌కే ప్రమాదంగా మారేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

గాయాలకి పెట్టింది పేరు స్టోక్స్

బెన్ స్టోక్స్‌కు గాయాలు అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆయన కెరీర్ మొత్తం గాయాల మయంగానే సాగింది. కొన్నిసార్లు మైదానంలో ఆట వల్ల గాయపడితే, మరికొన్నిసార్లు తన ఆవేశం వల్ల తనని తాను గాయపరుచుకున్నారు.

2014: వెస్టిండీస్ పర్యటనలో సున్నా పరుగులకే అవుట్ అయిన ఆవేశంలో డ్రెస్సింగ్ రూమ్ లాకర్‌ను గుద్దడంతో ఆయన మణికట్టు విరిగింది. ఫలితంగా ఆ ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యారు.

2021: వేలికి తీవ్రమైన గాయం కావడంతో పాటు మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్నారు.

2023-25: వరుసగా హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు, వెన్నునొప్పి కారణంగా ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. భారత్‌తో జరిగిన కీలకమైన టెస్ట్ మ్యాచ్‌లకు కూడా ఆయన దూరమయ్యారు.

అభిమానుల్లో ఆందోళన

34 ఏళ్ల వయసులో ఉన్న స్టోక్స్, ఫిట్‌నెస్ సమస్యలతో ఇప్పటికే సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో ముఖానికి తగిలిన ఈ గాయం ఆయన మానసిక ధైర్యాన్ని ఏ మేరకు దెబ్బతీస్తుందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఈ గాయం వల్ల ఆయన ఏవైనా మ్యాచులకు దూరమవుతారా లేదా అనే దానిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ స్టోక్స్ షేర్ చేసిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి