IPL 2025: పాక్‌తో యుద్ధం.. ఐపీఎల్ 2025 వారం మాత్రమే వాయిదా

పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్లేయర్స్ భద్రతను దృష్టిలో పెట్టుకుని టోర్నీని ఒక వారం పాటు మాత్రమే సస్పెండ్ చేసినట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్‌లు, స్పాన్సర్లతో.. ఆ వివరాలు

IPL 2025: పాక్‌తో యుద్ధం.. ఐపీఎల్ 2025 వారం మాత్రమే వాయిదా
Ipl 2025

Updated on: May 09, 2025 | 3:20 PM

భారత్‌-పాక్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా IPL మ్యాచులను వారం రోజుల పాటు వాయిదా వేయాలని BCCI నిర్ణయించింది. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్‌లు, స్పాన్సర్లతో కీలక సమావేశం తర్వాత ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఐపీఎల్ పాలకమండలి తెలిపింది. IPLలో ఇంకా 16 మ్యాచులున్నాయి. నిన్న ధర్మశాలలో మ్యాచ్‌ జరుగుతుండగానే విద్యుత్‌ సరఫరా ఆపేశారు. సాంకేతిక లోపమని ముందుగా భావించారు. కాని భద్రతా కారణాలరీత్యా విద్యుత్‌ సరఫరా నిలిపేశారని తెలియడంతో మ్యాచ్‌ ఆపేశారు. అటు పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయే ఆలోచనలో ఆస్ట్రేలియా క్రీడాకారులు ఉన్నారు.

ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని.. వారం తర్వాత నిరవధిక వాయిదాపై బీసీసీఐ చర్చించనుంది. కొత్త షెడ్యూల్, వేదికలపై త్వరలోనే బోర్డు ప్రకటించనుంది. ఈ కీలక సమయంలో.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్ధం చేస్తున్న జవాన్లకు తమ సెల్యూట్ అని BCCI పేర్కొంది. భారత సైన్యం బలంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది.