క్రికెట్ ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్…స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ను అనుమతించే యోచనలో బీసీసీఐ

|

Jan 21, 2021 | 5:29 AM

టీమిండియా అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోవిడ్ కారణంగా మ్యాచులను ప్రత్యేక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో క్రికెట్..

క్రికెట్ ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్...స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ను అనుమతించే యోచనలో బీసీసీఐ
Follow us on

Fans Allow in The Stadium : టీమిండియా అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోవిడ్ కారణంగా మ్యాచులను ప్రత్యేక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన అందుబాటులోకి రావడంతో క్రికెట్ మ్యాచ్‌ల‌ను స్టేడియంలో  చూడాల‌ని ఉవ్విళ్లూరుతున్నవారికి ఆశ‌లు నెరవేర్చేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

భారత్ వేదికగా జరుగనున్న ఇండియా- ఇంగ్లండ్ సిరీస్‌కు క‌నీసం 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను స్టేడియంలోకి అనుమతించాలని భావిస్తోంది. ఈ సిరీస్ జ‌రిగే అన్ని స్టేడియాల్లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాల‌ని ప్లాన్ చేస్తోంది. కరోనా కార‌ణంగా ఈ టూర్ మొత్తాన్ని కేవ‌లం మూడు స్టేడియాల‌కే ప‌రిమితం చేశారు. ఇందులో చెన్నై, అహ్మ‌దాబాద్‌, పుణె నగరాలను గుర్తించారు.

మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో కొన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్లు మాత్రం 20 నుంచి 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే అనుమ‌తించే అవ‌కాశం ఉంది. చివ‌రిసారి గ‌తేడాది జ‌న‌వ‌రిలో భారత్-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ప్రేక్ష‌కులు ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్‌ను చూశారు.

ఆ త‌ర్వాత అస‌లు ఇండియాలో మ్యాచ్‌లే జ‌ర‌గ‌లేదు. ఐపీఎల్ కూడా యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా సాగింది. డొమెస్టిక్ టోర్నీలైన రంజీ ట్రోఫీ, స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలు కూడా ప్రేక్ష‌కులు లేకుండానే సాగుతున్నాయి.