సౌథాంప్టన్: వరల్డ్ కప్‌లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. పసికూనలనుకున్న అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాయి. టాప్ జట్లకు షాక్‌లు ఇస్తూ..తమని లైట్ తీసుకోవద్దంటూ సంకేతాలు పంపుతున్నాయి. కాగా ఈ రెండు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఇందులో భాగంగా అఫ్గాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోయిన అఫ్గాన్ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో జోరు మీదున్న బంగ్లా సెమీస్ బెర్తుకోసం ప్రయత్నిస్తోంది. సౌథాంప్టన్‌లో వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది.