వరల్డ్‌కప్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో రెండు సంచలన విజయాలు సాధించిన బంగ్లాదేశ్.. భారత్‌కు చెమటలు పట్టించిన ఆఫ్ఘనిస్థాన్‌తో తలబడనుంది. సౌథాంఫ్టన్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.
బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్న బంగ్లాదేశ్…
విండీస్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా బ్యాట్స్‌మెన్ 41 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటుకున్నారు. అటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తమీమ్ ఇక్బల్, సౌమ్య సర్కార్, రహీమ్, షకిబుల్ హాసన్, మహమ్మదుల్లాతో బంగ్లా బ్యాటింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇకపోతే షకిబుల్ హాసన్ ప్రతీ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీ టాప్ స్కోరర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ తర్వాత స్థానంలో నిలిచి వారెవ్వా అనిపించుకుంటున్నాడు.
ఆత్మవిశ్వాసంతో ఆఫ్ఘనిస్థాన్…
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ కేవలం 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ ఈ మ్యాచ్ ద్వారా అఫ్గాన్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మాత్రం పెరిగింది. భారత్‌లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో క్రీడా పండితులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు స్పిన్‌లో మ్యాజిక్ చేయడంతో పాటు, బ్యాటింగ్‌లోనూ ఆ జట్టు ఫరవాలేదనిపిస్తోంది.
కాబట్టి ఇవాళ ఈ ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.