డమ్మీ కాదు డైనోసార్.. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. కానీ చివరికి దెబ్బైపోయాడు

ది హండ్రెడ్ లీగ్ ఆరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ తుఫాను బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. అయితేనేం అతడి జట్టు మాత్రం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈ జట్టు.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

డమ్మీ కాదు డైనోసార్.. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊహకందని ఊచకోత.. కానీ చివరికి దెబ్బైపోయాడు
The Hundred

Updated on: Aug 11, 2025 | 4:32 PM

6 సిక్సర్లు, 6 ఫోర్లతో 172 పరుగుల స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు ఈ బ్యాటర్. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆటగాడు బౌండరీలతో విరుచుకుపడినా.. తన జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. చివరి వరకు అజేయంగా నిలబడినా.. అతడి జట్టు విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ఈ బ్యాట్స్‌మెన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్టు ది హండ్రెడ్ లీగ్‌లో ఖాతాను తెరవలేదు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

జానీ బెయిర్‌స్టో ఇన్నింగ్స్ వృధా..

ది హండ్రెడ్(పురుషుల) లీగ్ ఆరో మ్యాచ్ లండన్ స్పిరిట్, వెల్ష్ ఫైర్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెల్ష్ ఫైర్ జట్టు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెల్ష్ ఫైర్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో జట్టును గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ చివర్లో విఫలమయ్యాడు. ఈ సమయంలో అతడు 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయినప్పటికీ, అతని జట్టు 100 బంతుల్లో 6 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లీగ్‌లో వెల్ష్ ఫైర్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఇప్పటిదాకా ఖాతాను తెరవలేదు. చివరి మ్యాచ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది ఈ జట్టు. ఆ మ్యాచ్‌లో కూడా బెయిర్‌స్టో 23 బంతుల్లో 42 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. ది హండ్రెడ్ ఆరో మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తుఫాను అర్ధశతకం సాధించాడు.

డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ..

ది హండ్రెడ్ లీగ్ ఆరవ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తుఫాను అర్ధశతకం సాధించి జట్టును భారీ స్కోరు సాధించేలా చేశాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో పాటు, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జేమీ స్మిత్ 14 బంతుల్లో 26 పరుగులు చేశాడు. వెల్ష్ ఫైర్ తరపున జోష్ హల్ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక టార్గెట్ చేధించడంలో బోల్తాపడిన వెల్ష్ ఫైర్ జట్టు 8 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

బెయిర్‌స్టో, క్రిస్ గ్రీన్ జట్టును గెలిపించలేకపోయారు..

164 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 6 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. జానీ బెయిర్‌స్టో, క్రిస్ గ్రీన్ మాత్రమే రాణించారు. క్రిస్ గ్రీన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 32 పరుగులు చేశాడు. కానీ జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. లండన్ స్పిరిట్ తరపున డేనియల్ వొరాల్ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇది చదవండి: అంతా గంభీర్ మాయ.! గిల్‌తో పాటు ఆ 5గురు ఆసియా కప్ నుంచి అవుట్.. బుల్డోజర్ ఎంట్రీ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..