
Who will hold the mace at the end of the #WTC23 Final? ?
The captains had their say ➡️ https://t.co/lHLFzv4AF4 pic.twitter.com/Tum9LcXYJJ
— ICC (@ICC) June 6, 2023
ఇరుజట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
డబ్ల్యూటీసీ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. హెడ్ (146), స్మిత్ (95) రన్స్ తో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ, సిరాజ్, శార్దూల్ తలా ఒక వికెట్ తీశారు.
కొత్త బంతిని తీసుకున్నా భారత బౌలర్లకు వికెట్ దక్కలేదు. స్మిత్, హెడ్ జోడీ పరుగుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరు అజేయమైన నాలుగో వికెట్ కు 244 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 84 ఓవర్లలో 320/3. హెడ్ (143), స్మిత్ (90) రన్స్ తో క్రీజులో ఉన్నారు.
మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 53, ట్రావిస్ హెడ్ 100 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 150 పరుగులు దాటింది.
హెడ్ కెరీర్‌లో 5వ సెంచరీ సాధించాడు. ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 38వ ఫిఫ్టీని సాధించాడు.
మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 49, ట్రావిస్ హెడ్ 94 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది.
హెడ్ తన కెరీర్‌లో 14వ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆరో సెంచరీకి చేరువలో ఉన్నాడు. స్మిత్ కూడా యాభైకి చేరువలో ఉన్నాడు.
భాతర బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ(52 పరుగులు, 60 బంతులు) పూర్తి చేశాడు. వన్డే బ్యాటింగ్ చేస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 45 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు పూర్తి చేసింది. స్మిత్(32), హెడ్ మధ్య 85 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 29, తెవిస్ హెడ్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.
రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 13, తెవిస్ హెడ్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మార్నస్ లాబుషెన్ 26 పరుగుల వద్ద అవుటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ 43 పరుగుల వద్ద, ఉస్మాన్ ఖవాజా సున్నాతో ఔటయ్యారు.
శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.
లంచ్ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు మహ్మద్ షమీ షాకిచ్చాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ మార్నస్ లబూషెన్(26)ను బౌల్డ్ చేశాడు. దీంతో 76 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది.
తొలి సెషన్ పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. మార్నస్ లబుషెన్ 26, స్మిత్ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సిరాజ్, శార్దుల్ తలో వికెట్ పడగొట్టారు.
భాతర బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ(43 పరుగులు) వైపు దూసుకెళ్తున్నాడు. అయితే, ఇన్నింగ్స్ 21.4వ ఓవర్లో శార్తుల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ కేఎస్ భరత్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో హాఫ్ సెంచరీ చేయకుండానే వికెట్ కోల్పోయాడు. దీంతో డేంజరస్‌గా మారుతోన్న భాగస్వామ్యాన్ని విడదీశారు. వార్నర్, మార్నస్‌ల మధ్య రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 38, మార్నస్ లబుషెన్ 16 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.
14 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం ఒక వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్ 21, మార్నస్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు హైదరాబాదీ పేసర్ తొలి షాక్ అందించాడు. డేంజరస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా రూపంలో కంగారులు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో సిరాజ్ రూపంలో రోహిత్ సేనకు తొలి విజయం దక్కింది.
జట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో భారత్ ఫీల్డింగ్ చేయనుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌లో ఇరు జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి
ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో 176 టెస్టులు ఆడగా, అందులో కేవలం 31% మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో ఇక్కడ టీమ్ ఇండియా 68 మ్యాచ్‌లు ఆడి 9 మాత్రమే గెలిచింది. మైదానం గురించి చెప్పాలంటే, ఓవల్‌లో ఆస్ట్రేలియా 38 టెస్టుల్లో 7 మాత్రమే గెలిచింది.అంటే 14% మ్యాచ్‌లు గెలిచింది. భారత్ ఇక్కడ 14 మ్యాచ్‌లు ఆడగా 2 మాత్రమే గెలిచింది.
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్/జయ్‌దేవ్ ఉనద్కత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్
Focus ?
Intensity ✅
Smiles ?#TeamIndia geared up for the #WTC23 Final! ? ? pic.twitter.com/wXJipLvDAE— BCCI (@BCCI) June 7, 2023