
బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా పయనమవుతోంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్‌కు.. ఆ జట్టు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఓవర్ నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. డేవిడ్ వార్నర్(126), మిచిల్ మార్ష్(121) భారీ సెంచరీలతో కదంతొక్కారు. పాకిస్తాన్ పేస్ బౌలింగ్‌ను తునాతునకలు చేశారు. 85 బంతుల్లో వార్నర్ తన శతకాన్ని పూర్తి చేయగా.. మార్ష్ ఆ వెంటనే 100 బంతుల్లో తన సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే మార్ష్, వార్నర్ 2011 ప్రపంచకప్‌లో వాట్సన్, హడిన్ నమోదు చేసిన 183 పరుగుల భాగస్వామాన్ని వీరిరువురూ బద్దలు కొట్టారు. మార్ష్ 121 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అఫ్రిది బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా.. వార్నర్ మాత్రం ఇంకా క్రీజులోనే ఉన్నాడు.
ఆడిన మూడు మ్యాచ్‌లలో కేవలం ఒకదానిలోనే అర్ధ సెంచరీ సాధించిన మార్ష్.. ఇవాళ జరుగుతోన్న పాకిస్తాన్‌పై మాత్రం తన దూకుడైన బ్యాటింగ్‌ను చూపించాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కున్న మార్ష్ ౯ సిక్సర్లు, 10 ఫోర్లతో 121 పరుగులు సాధించాడు. వరల్డ్‌కప్‌లో మార్ష్‌కి ఇది మొదటి సెంచరీ కాగా.. ఓ ఆస్ట్రేలియన్ బ్యాటర్ తన పుట్టినరోజు నాడు శతక్కొట్టాడు కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక వార్నర్ బ్యాటింగ్ విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌లో భారత్‌పై 41పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. అయితే ఆ తర్వాత శ్రీలంక, దక్షిణాఫ్రికాపై తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్‌పై చెలరేగిపోయాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాదేశాడు.
David Warner’s 21st ODI century leads the Australia charge in Bengaluru 🔥@mastercardindia Milestones 🏏#CWC23 | #PAKvAUS pic.twitter.com/TwxPUydS5W
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023
Mitchell Marsh celebrates his birthday with a scintillating ton 🎉@mastercardindia Milestones 🏏#CWC23 | #AUSvPAK pic.twitter.com/fQLZ44TwV2
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు కొట్టడం ఇది నాలుగోసారి. మొదటిగా 2011లో జింబాబ్వేపై శ్రీలంక ఓపెనర్లు తరంగ, దిల్షాన్ సెంచరీలు కొట్టారు. ఆ తర్వాత అదే ఏడాదిలో వీరిద్దరే ఇంగ్లాండ్‌పై కూడా ఇదే ఫీట్ సాధించారు. ఇక 2019లో శ్రీలంకపై టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రాహుల్ సెంచరీలు సాధించగా.. ఇక ఇప్పుడు వార్నర్, మార్ష్ పాకిస్తాన్‌పై సెంచరీలు సాధించారు.