Asia Cup: కప్పు లేకుండానే క్రేజీ సెలబ్రేషన్స్‌..! ఈ కిరాక్‌ ఐడియా ఎవరిదంటే..?

ఆసియా కప్ 2025ను టీమిండియా యువ జట్టు గెలుచుకుంది. పాకిస్థాన్‌ను మూడుసార్లు ఓడించి ఆధిపత్యం చాటింది. ఫైనల్‌లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో కప్పు సాధించారు. అయితే మ్యాచ్ తర్వాత ట్రోఫీ అందుకోడానికి నిరాకరించడంతో, పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కప్పును తీసుకెళ్లారు.

Asia Cup: కప్పు లేకుండానే క్రేజీ సెలబ్రేషన్స్‌..! ఈ కిరాక్‌ ఐడియా ఎవరిదంటే..?
Trophy Controversy Cricket

Updated on: Sep 30, 2025 | 3:28 PM

ఇటీవలె ముగిసిన ఆసియా కప్‌ 2025లో టీమిండియాకు ఎదురే లేకుండాపోయింది. ఈ టీమ్‌ కూడా యంగ్‌ టీమిండియా తుఫాన్‌ ముందు నిలువలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను అయితే టీమిండియా కుర్రాళ్లు ముచ్చటగా మూడు సార్లు మట్టికరిపించారు. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ చేస్తూ ఆరంభంలో ఇబ్బంది పడినా తర్వాత తిలక్‌ సూపర్‌ బ్యాటింగ్‌ కప్పు మన సొంతమైంది.

అయితే ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కాస్త డ్రామా చోటు చేసుకుంది. ఏసీసీ, పీసీబీ ఛైర్మన్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. దీంతో వేరే వాళ్లతో కప్పు అందించకుండా నఖ్వీ ఏం చేశాడంటే ఆ కప్పును తనతో పాటే తీసుకొని గ్రౌండ్‌ నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు కప్పు లేకుండా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

2024లో టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అండ్‌ టీమ్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ను రీ క్రియేట్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నారు. కప్పు చేతిలో లేకపోయినా ఉన్నట్లు యాక్ట్‌ చేస్తూ చేసుకున్న సెలబ్రేషన్స్‌ వైరల్‌గా మారాయి. అయితే ఈ ఐడియా మాత్రం టీమిండియా యంగ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మనిషి చూస్తే ఇంత అమయాకంగా ఉంటాడు. మైండ్‌లో ఇన్ని క్రేజీ ఐడియాలు ఉన్నాయా అంటూ ఆ విషయం తర్వాత క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి