ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. 140 కిమీల వేగంతో 22 వికెట్లు.. అసలెవరీ అన్‌క్యాప్‌డ్ స్టార్..?

IPL Auction: ఫాస్ట్ బౌలర్ అన్షుమాన్ హూడా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. క్రికెటర్‌గా అతని ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. అతను ఒకప్పుడు రోలర్ స్కేటర్‌గా కూడా ఉన్నాడు. తాజాగా ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి క్రికెటర్‌గా మారిపోయాడు.

ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. 140 కిమీల వేగంతో 22 వికెట్లు.. అసలెవరీ అన్‌క్యాప్‌డ్ స్టార్..?
Anshuman Hooda

Updated on: Sep 04, 2026 | 2:06 PM

Anshuman Hooda: క్రికెట్‌లో రాణించాలనే కలతో చాలామంది చిన్న వయసు నుంచే శిక్షణ తీసుకుంటారు. కానీ అన్షుమన్ హుడా కథ మాత్రం అందుకు భిన్నం. ఇంజినీరింగ్ చదివి, ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌పై పట్టువదలని ఈ 25 ఏళ్ల పేసర్.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతడి అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి కూడా అతడిపై పడింది.

క్రికెట్‌నే వదిలేయాలనుకున్నాడు..!

అన్షుమన్ హుడా క్రికెట్‌లోకి చాలా ఆలస్యంగా వచ్చాడు. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజినీరింగ్ చదువుకున్న అతడు.. సంప్రదాయ జూనియర్ క్రికెట్ వ్యవస్థలో పెద్దగా ఆడలేదు. అండర్-23 ట్రయల్స్‌లో వరుసగా రెండుసార్లు విఫలమయ్యాడు.

దీంతో క్రికెట్‌లో తనకు భవిష్యత్తు లేదని భావించి.. ఇంజినీరింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 2023లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా EYలో ఉద్యోగం కూడా సంపాదించాడు.

ఇవి కూడా చదవండి

కోచ్ ఇచ్చిన ఒక్క అవకాశం..

అన్షుమన్ క్రికెట్‌ను వదిలేయాలనుకున్న సమయంలో అతడి కోచ్ హరీష్ దాగర్ కీలకంగా వ్యవహరించాడు. మరో ఏడాది పూర్తిగా క్రికెట్‌కు అవకాశం ఇవ్వాలని అతడిని ఒప్పించాడు.

ఎక్కువమంది చదివినది: Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!

పశ్చిమ విహార్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహించే దాగర్.. అన్షుమన్‌లో ఉన్న సహజ వేగం, శారీరక సామర్థ్యాన్ని గుర్తించాడు. దీంతో ఉద్యోగం చేస్తూనే రాత్రి వేళల్లో శిక్షణ కొనసాగించాడు. క్రమంగా అతడి బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం పెరిగాయి.

DPLలో సత్తా.. పర్పుల్ క్యాప్..

ఈ కష్టానికి DPL 2026లో భారీ ఫలితం దక్కింది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తరపున ఆడిన అన్షుమన్.. టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 22 వికెట్లు చేరాయి. అతడి ప్రదర్శనతో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ టైటిల్ కూడా గెలుచుకుంది.

అన్షుమన్ బౌలింగ్‌లో మరో ప్రత్యేకత అతడి వేగం. అతడు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించగలడు. సహజ వేగంతో పాటు బౌన్స్ రాబట్టే సామర్థ్యం అతడిని మరింత అద్భుతమైన పేసర్‌గా మార్చింది.

ఇక పూర్తిస్థాయి క్రికెటర్‌గా..

ఇప్పటివరకు ఇంజినీరింగ్ ఉద్యోగం, క్రికెట్ రెండింటినీ సమన్వయం చేసిన అన్షుమన్.. తాజా విజయంతో తన ప్రాధాన్యతలను మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నాడు. క్రికెట్‌లో గత కొన్ని నెలల్లో గణనీయమైన పురోగతి కనిపించడంతో ఇకపై పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు.

ఎక్కువమంది చదివినది: 10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..

DPLలో చూపించిన ప్రదర్శనతో ఐపీఎల్ వేలం అవకాశాలు కూడా అతడి ముందుకు వస్తున్నాయి. సాధారణ క్రికెట్ మార్గంలో ప్రయాణించకపోయినా.. పట్టుదలతో తనకు తానే దారి నిర్మించుకున్న అన్షుమన్ హుడా కథ ఇప్పుడు యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us