Cricket News: ఈ ముగ్గురు ఆటగాళ్ల కెరీర్‌ ముగిసినట్లే.. టీమ్ ఇండియాకు తిరిగి రావడం దాదాపు అసాధ్యం..!

Cricket News: టీమ్ ఇండియాకు ఆడాలనేది చాలామంది కల. కానీ దానికి ముందు జట్టులో స్థానం సంపాదించడం చాలా కష్టం. ఒకవేళ సంపాదించిన దానిని కొనసాగించడం మరింత కష్టం.

Cricket News: ఈ ముగ్గురు ఆటగాళ్ల కెరీర్‌ ముగిసినట్లే.. టీమ్ ఇండియాకు తిరిగి రావడం దాదాపు అసాధ్యం..!
Cricket News
Follow us

|

Updated on: Mar 18, 2022 | 5:49 AM

Cricket News: టీమ్ ఇండియాకు ఆడాలనేది చాలామంది కల. కానీ దానికి ముందు జట్టులో స్థానం సంపాదించడం చాలా కష్టం. ఒకవేళ సంపాదించిన దానిని కొనసాగించడం మరింత కష్టం. ఇప్పుడు ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమైనట్లే. ఈ ఆటగాళ్లు చాలా బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో మళ్లీ ఈ ఆటగాళ్లు జట్టులోకి తిరగిరావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అందులో మొదటి వ్యక్తి ఇషాంత్‌ శర్మ. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా విఫలమవుతున్నాడు. చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో కనిపించాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఆగస్ట్ 2021లో ఇంగ్లాండ్ పర్యటనలో ఇషాంత్ శర్మ కెరీర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అతను 3 టెస్ట్ మ్యాచ్‌లలో 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టు తర్వాత, ఇషాంత్ శర్మకు మళ్లీ టీమ్ ఇండియాలో ఆడే అవకాశం లభించలేదు. అతని బంతుల్లో ఇప్పుడు మ్యాజిక్ కనిపించడం లేదు. ఇషాంత్ 100కి పైగా టెస్టులు ఆడాడు. అందులో 311 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ 2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో కెరీర్‌ని ప్రారంభించాడు. అయితే ఇప్పుడు అతని కెరీర్‌కు ముగినినట్లే కనిపిస్తోంది. జట్టుకు దూరమైన ఆటగాళ్లు రంజీలు ఆడాలని లేదంటే తిరిగి రావడం కష్టమని బీసీసీఐ చెప్పిన విషయం తెలిసిందే.

వృద్ధిమాన్ సాహా

వృద్ధిమాన్ సాహా చాలా మంచి వికెట్ కీపర్. టెస్టు క్రికెట్‌లో అతనికి ఆడే అవకాశం లభించలేదు. 2010లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి అతడికి జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు ఈ ఆటగాడు మళ్లీ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయగలడన్న ఆశ దాదాపుగా ముగిసింది. సాహా టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడితే.. అతను 40 టెస్టుల్లో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు సాధించాడు. జట్టుకు దూరమైన ఆటగాళ్లు రంజీలు ఆడాలని, లేదంటే పునరాగమనం కష్టమని బీసీసీఐ చెప్పినా వృద్ధిమాన్ సాహా ఆడటం లేదు.

అజింక్యా రహానే

అజింక్య రహానె చాలా ఘోరంగా పోరాడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. క్రీజులో నిలవలేకపోతున్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అజింక్య రహానే కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లోనే తొలగించారు. అక్కడి నుంచి కెరీర్ పతనం మొదలై గత రెండేళ్లుగా టీమిండియా తరఫున సెంచరీ సాధించలేకపోయాడు. అందుకే శ్రీలంకతో జరిగే సిరీస్‌ నుంచే అతడిని జట్టు మేనేజ్‌మెంట్ తప్పించింది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశం దక్కింది. శ్రేయాస్ ప్రతి సందర్భంలోనూ తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అజింక్యా రహానె టీమ్ ఇండియాలోకి పునరాగమనం అసాధ్యమనిపిస్తోంది.

Holi 2022: విచిత్ర సంప్రదాయం.. హోలీ రోజు కొత్త అల్లుడిని గుర్రంపై ఊరేగిస్తారు..!

Holi 2022: సేంద్రియ రంగులతో హోలీ ఆడండి.. పర్యావరణాన్ని కాపాడండి..

Hyderabad: జూబ్లీహిల్స్‌ రోడ్డులో కారు బీభత్సం.. రెండున్నరేళ్ల బాబు అక్కడికక్కడే మృతి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు