10 పరుగులకే 2 వికెట్లు.. కట్ చేస్తే.. 58 బంతుల్లో జట్టును కాపాడిన సన్‌రైజర్స్ బ్యాటర్.. జోష్‌లో ఫ్యాన్స్!

|

Feb 10, 2023 | 7:39 AM

అది సెమీఫైనల్ మ్యాచ్.. ఎదురుగా ఉన్నది గట్టి టీమ్.. కానీ ఆ జట్టు 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది..

10 పరుగులకే 2 వికెట్లు.. కట్ చేస్తే.. 58 బంతుల్లో జట్టును కాపాడిన సన్‌రైజర్స్ బ్యాటర్.. జోష్‌లో ఫ్యాన్స్!
Aiden Markram
Follow us on

అది సెమీఫైనల్ మ్యాచ్.. ఎదురుగా ఉన్నది గట్టి టీమ్.. కానీ ఆ జట్టు 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్లేయర్.. ఒక ఎండ్‌లో స్కోర్‌బోర్డు పరుగులు పెట్టిస్తుంటే.. అప్పుడే వచ్చిన జట్టు కెప్టెన్ చక్కటి మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోర్ అందించాడు. కట్ చేస్తే.. ప్రత్యర్ధులను మట్టికరిపించి తన టీంను ఫైనల్‌‌కు చేర్చాడు. ఇంతకీ అతడెవరో కాదు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్. అతడు తుఫాన్ సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

దక్షిణాఫ్రికా T20 లీగ్ SA20 టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ఇందులో సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ పేలుడు సెంచరీతో చెలరేగాడు. సెంచూరియన్‌లో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టును కాపాడే బాధ్యతను కెప్టెన్ మార్క్‌రమ్ స్వయంగా తన భుజాలపై వేసుకున్నాడు.

ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన మార్క్‌రమ్.. ఆ తర్వాత గేర్ మార్చి ఒక్కసారిగా బ్యాట్‌తో నిప్పులు చెరిగాడు. జోబర్గ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. రొమారియో షెపర్డ్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో కలిపి 21 పరుగులు చేసి ఆఖర్లో అవుట్ అయ్యాడు. టీ20ల్లో మొదటిది, అలాగే ఈ టోర్నమెంట్‌లో మూడో శతకాన్ని సిక్స్ ద్వారా సాధించాడు మార్క్‌రమ్. అతడు కేవలం 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాతి బంతికే బౌండరీ కొట్టబోయి.. పెవిలియన్ చేరాడు. కానీ అతడి ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ 213 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

కాగా, లక్ష్యఛేదనలో జోబర్గ్ కింగ్స్ తడబడింది. ప్రధాన బ్యాటర్లు తక్కువ పరుగులకే అవుట్ కాగా, హెండ్రిక్స్(96) మాత్రం షెపర్డ్(38)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అది సరిపోలేదు. నిర్ణీత 20 ఓవర్లలో కింగ్స్ 6 వికెట్లు నష్టపోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్‌రైజర్స్ 14 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలుపొంది.. ఫైనల్స్‌కు చేరింది.