LPL 2025 : భారత క్రికెటర్లకు LPL గేట్ వే.. లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి ఇండియన్ ప్లేయర్స్ సందడి

భారతదేశంలో ఐపీఎల్ ఒక పండుగలా జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో దేశంలోని స్టార్ ప్లేయర్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ సత్తా చాటుతుంటారు. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు తొలిసారిగా పొరుగున ఉన్న లంక ప్రీమియర్ లీగ్‎లో ఆడనున్నారు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 1, 2025 నుంచి ప్రారంభం కాబోతోంది.

LPL 2025 : భారత క్రికెటర్లకు LPL గేట్ వే.. లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి ఇండియన్ ప్లేయర్స్ సందడి
Lanka Premier League 2025

Updated on: Oct 06, 2025 | 5:41 PM

LPL 2025 : భారతదేశంలో ఐపీఎల్ ఒక పండుగలా జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో దేశంలోని స్టార్ ప్లేయర్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ సత్తా చాటుతుంటారు. అయితే, ఇప్పుడు భారతీయ క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు తొలిసారిగా పొరుగున ఉన్న లంక ప్రీమియర్ లీగ్‎లో ఆడనున్నారు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 1, 2025 నుంచి ప్రారంభం కాబోతోంది. విదేశీ లీగ్‌లో భారత ఆటగాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

లంక ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. “ఈసారి టోర్నమెంట్‌లో మొదటిసారిగా భారత ఆటగాళ్లు కూడా కనిపించే అవకాశం ఉంది” ఈ లీగ్‌లో పాల్గొనే భారత క్రికెటర్ల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ ప్రకటనతో కొందరు ఇండియన్ ప్లేయర్లు ఈ విదేశీ లీగ్‌లో ఆడతారనే ఉత్కంఠ పెరిగింది.

లంక ప్రీమియర్ లీగ్‌లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత పాయింట్స్ టేబుల్‌లో టాప్‌ 4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. ఐదో జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది.

ప్లేఆఫ్స్‌కు చేరుకున్న నాలుగు జట్లలో పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు, పాయింట్స్ టేబుల్‌లో మూడో, నాలుగో స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుండి బయటకు వెళ్లిపోతుంది.

క్వాలిఫైయర్-1 లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫైనల్‌లో క్వాలిఫైయర్-1 గెలిచిన జట్టుతో, క్వాలిఫైయర్-2 విజేత తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన జట్టు లంక ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది.

 

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..