AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: దటీజ్ కాటేరమ్మ కొడుకు.. దీపావళి రోజున గురువుకు సర్‌ప్రైజ్ .. టీచర్ రియాక్షన్ వైరల్..!

Abhishek Sharma Diwali Surprise Visit: టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ దీపావళి రోజున తన చిన్ననాటి టీచర్‌ను ఆశ్చర్యపరిచాడు. సడన్ ఎంట్రీ ఇచ్చి, ఒక్కసారిగా మాస్క్ తొలగించగానే గుర్తుపట్టిన టీచర్ ఆనందంతో హత్తుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video: దటీజ్ కాటేరమ్మ కొడుకు.. దీపావళి రోజున గురువుకు సర్‌ప్రైజ్ .. టీచర్ రియాక్షన్ వైరల్..!
Abhishek Sharma Diwali Surprise Visit
Venkata Chari
|

Updated on: Nov 11, 2026 | 1:00 PM

Share

Abhishek Sharma Diwali Surprise Visit: కొన్ని బంధాలు కాలం గడిచినా చెక్కుచెదరవు. ఏళ్లు గడిచినా, ఎంత ఎత్తుకు ఎదిగినా.. తమను తీర్చిదిద్దిన గురువును గుర్తుంచుకునే శిష్యులు అరుదు. టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఆ కోవకు చెందినవాడేనని మరోసారి నిరూపించాడు. దీపావళి పర్వదినాన అమృత్‌సర్‌లో తన పాత టీచర్‌కు అభిషేక్ ఇచ్చిన అనూహ్య సర్‌ప్రైజ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కదిలిస్తోంది. క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా గురువుపై చూపిన అభిమానం యావత్ దేశం హృదయాన్ని హత్తుకుంటోంది.

రోడ్డు దాటి మరీ.. మాస్క్ తీసి సర్‌ప్రైజ్..!

అమృత్‌సర్‌లోని లిటిల్ మిలీనియం ప్రీస్కూల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్న సీసీటీవీ దృశ్యాలు చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. దీపావళి రోజున ఆ మార్గంలో కారులో వెళ్తున్న అభిషేక్ శర్మ.. అకస్మాత్తుగా కారు దిగాడు. మాస్క్ ధరించి రోడ్డు దాటి ప్రీస్కూల్ గేటు వైపు నడిచాడు. గేటు వద్దకు రాగానే మాస్క్ తొలగించాడు. ఎదురుగా వచ్చిన టీచర్ ఒక్క క్షణం తేరిపారా చూసింది.. మరుక్షణంలో గుర్తుపట్టింది.

“ఓ మై గాడ్!” అంటూ ఆశ్చర్యంతో కేక వేసింది. “ఇది నిజంగా పెద్ద సర్‌ప్రైజ్!” అంటూ ఆనందభాష్పాలతో అభిషేక్‌ను గట్టిగా హత్తుకుంది. గురు-శిష్యుల ఆ ఆత్మీయ ఆలింగనం అక్కడున్న వారందరినీ కదిలించింది.

“ఆకాశాన్ని తాకు.. కానీ వేర్లను మరవకు!”

ఈ హృద్య ఘట్టాన్ని పంచుకుంటూ పాఠశాల యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. “అంతర్జాతీయ క్రికెట్ సూపర్‌స్టార్ నుంచి ఒకప్పుడు ఆయనకు టీచర్‌గా ఉండే privilege పొందిన వ్యక్తికి అందిన ఆహ్లాదకరమైన సర్‌ప్రైజ్ ఇది! చిన్న విజయానికే మూలాలను మరిచిపోయే ఈ రోజుల్లో.. అభిషేక్ శర్మను కలవడం నిజమైన విజయానికి అర్థం ఏమిటో గుర్తు చేసింది. ఆకాశాన్ని తాకు, నక్షత్రాలను అందుకో.. కానీ నీ పునాదిని మాత్రం కోల్పోకు” అంటూ పాఠశాల పేర్కొంది.

“క్రికెటర్‌గా నువ్వు ఎదిగిన దానికంటే.. మనిషిగా నీలోని వినయం, ఆప్యాయత ఎంతో గొప్పవి. మనుషుల ప్రేమ, ఆశీస్సులే విజయాన్ని సార్థకం చేస్తాయి. మై డియర్ స్టూడెంట్.. మాపై ఎంతో గర్వపడేలా చేశావు. Keep soaring, keep shining! దేవుడు నిన్ను దీవించుగాక అభిషేక్.. The sky is not the limit!” అని భావోద్వేగంగా రాసుకొచ్చింది.

అదే పేజీలో పంచుకున్న మరో ఫొటోలో అభిషేక్ తన గురువులతో కలిసి ప్రీస్కూల్ ఆవరణలో నవ్వుతూ పోజులిచ్చాడు. “మీరు మా దీపావళిని మరింత ప్రకాశవంతం చేశారు” అని టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు.

నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న క్షణం..

ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిషేక్ సంస్కారాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. “మంచి టీచర్, మంచి విలువలు నేర్చుకున్న మంచి శిష్యుడు. మీ ఇద్దరినీ దేవుడు దీవించుగాక” అని ఒకరు కామెంట్ చేయగా.. “శిష్యులు గురువుల పట్ల ప్రేమ, గౌరవం చూపడం చూస్తే ఎంతో సంతోషంగా ఉంది” అని మరొకరు రాశారు. “దీపావళికి టీచర్‌ను కలవాలనే ఆలోచనే ఎంతో హృద్యంగా ఉంది” అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

విజయ శిఖరాలపై నిలబడినా.. తనను అక్షరాలు నేర్పిన గురువు ముందు తలవంచిన అభిషేక్ శర్మ.. నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us