ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఐపీఎల్(IPL)తో పాక్ సూపర్ లీగ్ (PSL)ను పోల్చడం సరికాదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా(Aakash Chopra) అన్నాడు. ఐపీఎల్, పీఎస్‌ఎల్ విలువపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా వ్యాఖ్యలను తప్పుబట్టాడు. వ్యూస్‌పరంగా పీఎస్‌ఎల్ మాత్రమే కాకుండా బిగ్‌బాష్ లీగ్ కూడా ఐపీఎల్ స్థాయికి చేరుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌కు మీడియా హక్కుల ద్వారానే బీసీసీఐ రూ. 16,375 కోట్లను సంపాదించింది.
“మీకు 100 కోట్ల మంది లేరు. రోహిత్ శర్మ PSLలో ఆడుతున్నాడనుకోండి. ఇంతకుముందు 7000 కోట్లు చెల్లిస్తున్న బ్రాడ్‌కాస్టర్ అకస్మాత్తుగా డబ్బును రూ.35,000 కోట్లకు పెంచాలని మీరు అనుకుంటున్నారా? కానీ అది మీ విలువను అకస్మాత్తుగా పెంచదు” అని ఆకాష్ అన్నారు. “భారత్‌కు ప్రేక్షకులు ఉన్నారు. ఇది భారత ఆటగాళ్లకు సంబంధించినది కాదు. ఇది ఆటగాళ్ల జీతాలకు సంబంధించినది కాదు, ఇది వేలం లేదా డ్రాఫ్ట్‌కు సంబంధించినది కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ఎవరైనా పోటీ పడగలరని నేను అనుకోను”. అని చెప్పాడు.
పీఎస్‌ఎల్‌ను 2016లో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రారంభించింది. ఆరు జట్లు డ్రాఫ్ట్ మోడల్‌లో ఆటగాళ్లను ఎంచుకుని ధరను నిర్ణయించి ఒప్పందం చేసుకుంటాయి. అయితే ఐపీఎల్‌లో వేలంలోకి వెళ్లడం వల్ల ఫ్రాంచైజీల పోటీ నేపథ్యంలో భారీ ధరను అందుకుంటారు. దీనినే పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా ప్రస్తావిస్తూ.. ‘పీఎస్‌ఎల్‌లోని ఆటగాళ్లకు వేలం నిర్వహిస్తే ఐపీఎల్‌లో కంటే భారీ ధరను దక్కించుకుంటారు. అప్పుడు పీఎస్‌ఎల్‌ను కాదని ఎవరు ఐపీఎల్ ఆడతారని అని అన్నారు.
Read Also.. Rohit Sharma: రోహిత్ శర్మ అతని కంటే గొప్ప కెప్టెన్ అవుతాడు.. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు..