Ind Vs Wi 1st Test Records
West Indies vs India, 1st Test: నేటి (జూలై 12) నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో మొత్తం 15 రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. అంటే కొంతమంది ఆటగాళ్లు రికార్డులకు చేరువలో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ప్రత్యేక రికార్డుల లిస్టులో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం..
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా మారడానికి విరాట్ కోహ్లీకి కేవలం 150 పరుగుల దూరంలో ఉన్నాడు.
- టెస్టు క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కింగ్ కోహ్లీ 25 పరుగులు చేయాల్సి ఉంది.
- వెస్టిండీస్‌కు చెందిన జాషువా డసిల్వా టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేయడానికి 143 పరుగులు చేయాలి.
- విదేశీ టెస్టుల్లో 500 బౌండరీలు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి 13 బౌండరీలు అవసరం.
- టెస్టు క్రికెట్‌లో 3500 పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ (3437) 63 పరుగులు చేయాలి.
- 8500 టెస్ట్ క్రికెట్ పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీ (8479) 21 పరుగులు చేయాలి.
- టెస్టు క్రికెట్‌లో 100 బౌండరీల లిస్టులో చేరాలంటే జాషువా డసిల్వా (94)కు ఆరు బౌండరీలు అవసరం.
- టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసేందుకు శుభ్‌మన్ గిల్ (921)కు 79 పరుగులు కావాలి.
- అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు పూర్తి చేసేందుకు రవిచంద్రన్ అశ్విన్ (697)కు మూడు వికెట్లు అవసరం.
- అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేయడానికి కెమర్ రోచ్ (396)కు నాలుగు వికెట్లు అవసరం.
- అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు పూర్తి చేసేందుకు అక్షర్ పటేల్ (145)కు 5 వికెట్లు అవసరం.
- టెస్టుల్లో 50 బౌండరీల లిస్టులో చేరాలంటే తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (42)కు ఎనిమిది బౌండరీలు అవసరం.
- ఈ మ్యాచ్‌తో విదేశాల్లో 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో అజింక్యా రహానే (49) చేరనున్నాడు.
- అంతర్జాతీయ క్రికెట్‌లో 200 క్యాచ్‌లు అందుకోవడానికి రోహిత్ శర్మ (195)కు 5 క్యాచ్‌లు మాత్రమే కావాలి.
- వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్‌కు 4 వికెట్లు మాత్రమే కావాలి. కాబట్టి తొలి టెస్టులోనే అశ్విన్ నుంచి గొప్ప రికార్డులు ఆశించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..