Ban Vs Pak: చివరి బంతికి రెండు పరుగులు చేయాలి.. ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదంటే..

|

Nov 23, 2021 | 8:20 AM

బంగ్లాదేశ్‎లోని ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్‎లో బంగ్లాపై పాక్ ఉత్కంఠ విజయం సాధించింది. మహ్మద్ నవాజ్ చివరి బంతిని బౌండరీ తరలించడంతో పాక్ గట్టెక్కింది. సోమవారం జరిగిన మూడో ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది పాక్...

Ban Vs Pak: చివరి బంతికి రెండు పరుగులు చేయాలి.. ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదంటే..
Pak
Follow us on

బంగ్లాదేశ్‎లోని ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్‎లో బంగ్లాపై పాక్ ఉత్కంఠ విజయం సాధించింది. మహ్మద్ నవాజ్ చివరి బంతిని బౌండరీ తరలించడంతో పాక్ గట్టెక్కింది. సోమవారం జరిగిన మూడో ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది పాక్. ఈ మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఓపెనర్‌ నైమ్‌ 47 పరుగులు చేశాడు. 125 స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ చాలా నెమ్మదిగా ఆడింది. దీంతో ఆ జట్టుకు ఆఖరి ఓవరులో 8 పరుగులు చేయాల్సి వచ్చింది.

చివరి ఓవరును బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా వేశాడు. అప్పడు క్రీజ్‎లో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీ ఉన్నారు. మహ్మదుల్లా మొదటి బంతికి పరుగు ఇవ్వలేదు. రెండు, మూడు బంతులకు వరుసగా సర్ఫరాజ్‌ అహ్మద్‌ (6), హైదర్‌ అలీ (45)ను ఔట్‌ చేశాడు. క్రీజులోకి వచ్చిన ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ నాలుగో బంతికి సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతికి అతడు వెనుదిరగడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి రావడంతో అందరు ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. ఇంతలో మొహమ్మద్‌ నవాజ్‌ ఫోర్‌ బాది పాక్‌ను గట్టెక్కించాడు. హైదర్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు రాగా మొహమ్మద్‌ రిజ్వాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 26న మొదలవుతుంది. “ఇరు జట్ల బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ” పరుగులు చేయడానికి క్రీజులో కొంత సమయం గడపవలసి ఉంది.” అని బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా అన్నాడు.

Read Also.. Ind Vs Pak: క్రికెట్ రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుంది.. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే..