Team India: ఉమెన్స్ టీంలో కడప బిడ్డకు లక్కీ ఛాన్స్.. మంత్రి లోకేష్ ప్రశంసలు

India squad announced for women’s Tri-Nation ODI Series: ఈ సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. కాగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వీరితోపాటు రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు గాయపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఆ ఇద్దరిని ఎంపిక చేయలేదు.

Team India: ఉమెన్స్ టీంలో కడప బిడ్డకు లక్కీ ఛాన్స్.. మంత్రి లోకేష్ ప్రశంసలు
Sree Charani

Updated on: Apr 08, 2025 | 7:59 PM

India squad announced for women’s Tri-Nation ODI Series: శ్రీలంక, దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల ట్రై-నేషన్ వన్డే సిరీస్ కోసం భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ సిరీస్ శ్రీలంకలో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ఆర్ ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ సిరీస్‌లో భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 27న ఆతిథ్య శ్రీలంకతో ఆడనుంది. ఆ తర్వాత, ఏప్రిల్ 29న భారత్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.

ట్రై సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులోకి ముగ్గురు యువ క్రికెటర్లు కశ్వీ గౌతమ్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్ అంతర్జాతీయ జట్టులోకి తొలిసారి ఎంపికయ్యారు. కాగా, తెలుగమ్మాయి శ్రీ చరణి భారత జట్టులోకి తొలిసారి ఎంపికవ్వడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.

గాయపడిన టైటాస్, రేణుక..

ఈ సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. కాగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వీరితోపాటు రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు గాయపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఆ ఇద్దరిని ఎంపిక చేయలేదు.

ముక్కోణపు సిరీస్‌కు భారత మహిళల జట్టు..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), యాస్తికా భాటియా (కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, కష్వీ గౌతమ్, స్నేహ్ చరిత, టీజ్ హతీని, అరుణాల్ రెడ్డి, టీజ్ అరుణాల్ రెడ్డి ఉపాధ్యాయ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..