CWG 2022: ఎంతో ప్రత్యేకం ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్.. అందులో మహిళలదే అగ్రస్థానం.. ఎందుకో తెలుసా?

|

Jul 28, 2022 | 11:37 AM

CWG 22వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. అయితే, ఈ ఏడాది ఈ గేమ్స్‌లో ఓ ప్రత్యేకత ఉంది. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ పతకాల ఈవెంట్‌లను నిర్వహించనున్నారు. దీంతో మొట్టమొదటి బహుళ-క్రీడా అంతర్జాతీయ మీట్‌గా పేరుగాంచింది.

CWG 2022: ఎంతో ప్రత్యేకం ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్.. అందులో మహిళలదే అగ్రస్థానం.. ఎందుకో తెలుసా?
Gold Medals In Cwg 2022
Follow us on

గురువారం బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ (CWG).. మరింత కొత్తగా ముస్తాబైంది. CWG 22వ ఎడిషన్‌లో మహిళలు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే పురుషుల కంటే మహిళలకు ఎక్కువ పతకాలు దక్కనున్నాయి. అందుకే ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ మొట్టమొదటి బహుళ-క్రీడా అంతర్జాతీయ మీట్‌గా పేరుగాంచింది. 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా ప్రారంభమైన 11 రోజుల కామన్వెల్త్ క్రీడలు.. మూడోసారి ఇంగ్లండ్‌లో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్‌లో మహిళలకు మొత్తం 136 బంగారు పతకాలు దక్కనుండగా, పురుషులకు 134 బంగారు పతకాలు అందనున్నాయి. మిక్స్‌డ్ ఈవెంట్‌లలో 10 బంగారు పతకాలు దక్కనున్నాయి.

శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈవెంట్స్‌లో ఆస్ట్రేలియా ముందంజలో నిలిచే ఛాన్స్ ఉంది. గత నెలలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియన్లు పతకాల పట్టికలో రెండవ స్థానంలో నిలిచారు. టోక్యో ఒలింపిక్ స్టార్‌లు ఎమ్మా మెక్‌కియోన్, అరియార్నే టిట్‌మస్‌ల పునరాగమనం చేయనున్నారు.

టోర్నీ నుంచి నీరజ్ చోప్రా ఔట్..

ఇవి కూడా చదవండి

ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ (WAC 2022)లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచిన సంగతి తెలిసిందే. అయితే కామన్వెల్త్ టోర్నమెంట్‌లో భారత బృందంలో భాగం కావడం లేదు. ఇది భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఐశ్వర్యబాబు కూడా భారత జట్టులో లేడు. ఐశ్వర్యబాబు డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. అదే సమయంలో, కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశం నుంచి 213 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

19 క్రీడాంశాల్లో 283 పతక ఈవెంట్లు..

కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుక జులై 28 రాత్రి 11.30 నుంచి జరగనుంది. అదే సమయంలో, ఈసారి 72 దేశాల నుంచి 4,500 మందికి పైగా క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్నారు. కాగా 19 క్రీడాంశాల్లో 283 పతకాల ఈవెంట్లు జరగనున్నాయి. 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌లోకి అడుగుపెట్టడం గమనార్హం. 1934లో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలిసారిగా పాల్గొంది. అప్పట్లో కామన్వెల్త్ క్రీడలను బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు.