Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 రెండు రోజుల్లో మొదలుకానున్నాయి. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌లో పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటారు. నిజానికి గత కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ విషయానికి వస్తే అత్యుత్తమ ప్రదర్శన 2010లో ఉంది. ఆ ఏడాది ఆస్ట్రేలియా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లోని భారత ఆటగాళ్లు పాల్గొనే ప్రధాన ఈవెంట్‌లను ఓసారి చూద్దాం. ఇక భారత ఆటగాళ్ల గురించి మాట్లాడితే నీరజ్ చోప్రా, హిమా దాస్ లాంటి ఆటగాళ్లు పతక పోరులో నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి నీరజ్ చోప్రా గతంలోనూ తన పేరిట ఎన్నో పతకాలు సాధించాడు. జులై 30న పురుషుల మారథాన్‌లో నితేందర్ రావత్ కనిపించనున్నారు.
2 ఆగస్టు 2022
అవినాష్ సవాలే (పురుషుల 3000 రేసు)
మురళీ శ్రీశంకర్ (పురుషుల లాగ్ జంప్)
ముహమ్మద్ అనీస్ యాహియా (పురుషుల లాగ్ జంప్)
ధనలక్ష్మి శేఖర్ (మహిళలు 100మీ)
జ్యోతి యరాజ్ (మహిళల 100 మీటర్ల హర్డిల్)
మన్‌ప్రీత్ కౌర్ (మహిళా షాట్‌పుట్)
నవజిత్ కౌర్ ధిల్లాన్ (మహిళల ట్రిపుల్ జంప్)
3 ఆగస్టు 2022
ఐశ్వర్య బి (మహిళల ట్రిపుల్ జంప్)
5 ఆగస్టు 2022
అబ్దుల్లా అబూ బకర్ (పురుషుల ట్రిపుల్ జంప్)
ప్రవీణ్ చిత్రవేల్ (పురుషుల ట్రిపుల్ జంప్)
బజరంగ్ పునియా (పురుషుల 65 కేజీలు)
దీపక్ పునియా (పురుషుల 86 కేజీలు)
మోహిత్ గ్రేవాల్ (పురుషుల 125 కేజీలు)
అన్షు మాలిక్ (మహిళలు 57 కేజీలు)
సాక్షి మాలిక్ (మహిళలు 62 కేజీలు)
దివ్య కక్రాన్ (మహిళలు 68 కేజీలు)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..