PENG SHUAI: తమ అధికారానికి ఇబ్బందిగా భావించిన వ్యక్తులను శిక్షించాలని చైనీస్ ప్రభుత్వం కోరుకుంటే మాత్రం.. వారిని భయపెట్టి చల్లని లేదా అతిశీతలమైన కొవెంట్రీలో ఉంచుతారు. లేకుంటే అలా ప్రవర్తించకూడదని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తారు. లేదా వారి కుటుంబ సభ్యులపై కఠినంగా ప్రవర్తిస్తూ ప్రతీకారం తీర్చుకుంటారు. ఇలాంటి బహిష్కరణలు చైనాలో కొత్తవేమీ కాదు. కానీ, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయ్ కిడ్నాప్ అయిన తీరు ఇతరుల కంటే భిన్నమైన కోణాన్ని కలిగి ఉంది.
చైనా ప్రభుత్వ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలే కారణమా?..
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయ్ కొన్ని రోజుల క్రితం మాజీ ప్రభుత్వ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో చైనా ప్రభుత్వం ఆమెపై తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే పెంగ్‌ని కిడ్నాప్ చేశారన్న వాతావరణం అక్కడ ఏర్పడింది. ఇలాంటి వార్తలను ఖండించడంతోపాటు ఈ పరిస్థితి నుంచి ప్రజలను తప్పించేందుకు పెంగ్ అధికారిక మెయిల్ ఐడీ సురక్షితమని క్లెయిమ్ చేశారు. కానీ పెంగ్ షుయ్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకపోవడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
彭帅pengshuai一起吃的饭。北京的宜宾招待所,据对网红餐厅@WTA @atptour @cilic_marin @DjokerNole @usopen @Wimbledon @andy_murray pic.twitter.com/e1e4lF2f41
— 丁力 (@li_ding1) November 20, 2021
#Metoo కోణం కారణంగా ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అందులోనూ ఆమె టెన్నిస్‌లో ప్రముఖ క్రీడాకారిణి కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ఇలాంటి ఘటనలు అక్కడ చాలనే జరిగాయి. వారిలో అలీ బాబా ఫేమ్ బిలియనీర్ జాక్ మా, కెనడియన్ వ్యాపారవేత్త జియావో జియాన్‌హువాలను హాంకాంగ్ హోటల్ లాబీలో వీల్‌చైర్‌లో కిడ్నాప్ చేశారు. అలాగే సినిమా నటుడు జావో వెయ్, ఆర్టిస్ట్ ఐ వీవీని రాత్రిపూట అజ్ఞాతంలోకి తీసుకెల్లారు. వీరంతా అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ స్వరం వినిపించినందుకు గాను ఇలాంటి దాడులకు గురయ్యారు. అలాగే పుస్తక విక్రేత గుయ్ కూడా మిన్‌హై పాలకవర్గ సభ్యులపై ఆరోపణలు చేస్తూ కొన్ని వార్తలు ప్రచురించడంతో ఆయన్ను కూడా ఇలానే చేశారు.
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు సెరెనా విలియమ్స్, నవోమి ఒసాకా, నోవాక్ జొకోవిచ్ వంటి అగ్రశ్రేణి టెన్నిస్ స్టార్లు కూడా చైనా క్రీడాకారిణిపై తమ భయాలను వ్యక్తం చేశారు. రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ.. “ఆమె మా టెన్నిస్ ఛాంపియన్‌లలో ఒకరు. మాజీ ప్రపంచ నంబర్ 1 అని, స్పష్టంగా ఇది మాకు సంబంధించిన విషయం” అని ఘాటుగానే మాట్లాడాడు.”ఆమె సురక్షితంగా ఉందని నేను ఆశిస్తున్నాను. టెన్నిస్ కుటుంబం కలిసి ఉంటుంది. టెన్నిస్ కుటుంబం మా రెండవ కుటుంబం అని మేం ఎల్లప్పుడూ మా పిల్లలకు చెబుతుంటాం. నేను 20-25 సంవత్సరాలుగా టెన్నిస్‌లోనే ఉన్నాను. నేను టెన్నిస్‌ను ప్రేమిస్తున్నాను. అక్కడ ఉన్న వ్యక్తులను నేను ప్రేమిస్తున్నాను. క్రీడాకారులు చాలా ప్రత్యేకమైన వారు” అంటూ పేర్కొన్నాడు.
వివాదం మొదలైంది ఎక్కడంటే..
పెంగ్ షుయ్ మాజీ ప్రభుత్వ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే చైనాలో పెద్ద దుమారం చెలరేగింది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ ప్రేమికులు పెంగ్‌కు మద్దతుగా గళం విప్పారు. కానీ చైనాలో ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ ప్రతినిధులకు వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఈ విషయాన్ని అణిచివేసేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సమావేశమైంది. ఈ విషయంలో మీడియాకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి వార్తలను ప్రచురించడాన్ని కూడా నిషేధించారు.
ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇ-మెయిల్ లో ప్రశ్నలు లేవనెత్తారు. పెంగ్ ష్వాయి అదృశ్యం తరువాత, మొత్తం అంతర్జాతీయ టెన్నిస్ ప్రపంచంలో ఆమె వైపు మాట్లాడింది. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, CEO స్టీవ్ సైమన్ కూడా పెంగ్ అధికారిక ఇమెయిల్ ఐడీ సురక్షితంగా ఉందని, లైంగిక వేధింపుల ఆరోపణలకు సరిపోలలేదంటూ ప్రశ్నించారు. అదే సమయంలో చాలా మంది టెన్నిస్ ఆటగాళ్ళు పెంగ్ షుయ్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ఆటగాళ్లతో ఆడటానికి నిరాకరించడం గురించి కూడా మాట్లాడారు. సెరెనా విలియమ్స్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ‘మేము మౌనంగా ఉండకూడదు, ఈ విషయంపై దర్యాప్తు చేయాలి’ అని రాసుకొచ్చింది.
ఫిబ్రవరి 2022లో వింటర్ ఒలింపిక్స్‌లోపు వివరణ రాకపోతే చైనాను బహిష్కరించాల్సిందేననే వాదన బలంగా వినిపిస్తుండడంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వేగంగా నష్ట నియంత్రణ చర్యలను తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, చైనా ప్రభుత్వ మీడియా పెంగ్ షుయ్ సురక్షితంగా ఉందని, త్వరలో వెల్లడిస్తానని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియో కూడా ఉంది. శనివారం జరిగినట్లుగా అందులో పేర్కొన్నారు. కాగా రెండో వీడియో టెన్నిస్ పోటీల్లోనిది. అది ఆదివారం రోజున జరిగిందని పేర్కొంటూ వీడియోలు విడుదల చేశారు.
గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు జిజిన్ ఒక రెస్టారెంట్‌లో పెంగ్ షువాయ్ కనిపించినట్లు పేర్కొంటూ రెస్టారెంట్ వీడియోను పోస్ట్ చేశారు. ఆమె కోటు, క్యాప్ ధరించి, ముఖానికి మాస్క్ ధరించి కనిపించడం చూడొచ్చు. రెండో వీడియోలో ఆమె డిన్నర్ చేస్తూ కనిపించింది. ఆమె క్షేమంగా ఉందని, త్వరలోనే అందరికీ వెల్లడిస్తానని జిజిన్ పేర్కొన్నారు. జిజిన్ తన కోచ్, ఇతర సహచరులతో టెన్నిస్ గురించి చర్చిస్తున్నట్లు పేర్కొంది.
Peng Shuai showed up at the opening ceremony of a teenager tennis match final in Beijing on Sunday morning. Global Times photo reporter Cui Meng captured her at scene. pic.twitter.com/7wlBcTMgGy
— Hu Xijin 胡锡进 (@HuXijin_GT) November 21, 2021
టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా బీజింగ్‌లో కనిపించిన పెంగ్ షుయ్, జూనియర్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పెంగ్ షుయ్ హాజరయిందంటూ పేర్కొంటూ చైనా స్టేట్ మీడియా విడుదల చేసింది. ఈ ఫోటోను గ్లోబల్ టైమ్స్ ఫోటోగ్రాఫర్ కుయ్ మెంగ్ తీశారు. ఈ వీడియో, ఫోటో ఫిలే కిడ్స్ జూనియర్ టెన్నిస్ ఛాలెంజర్ ఫైనల్ ప్రారంభోత్సవానికి సంబంధించినది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇందులో పెంగ్‌షువాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలిపారు.
అయితే ఇదంతా అంతర్జాతీయంగా వస్తున్న ఆరోపణలను కట్టడిచేసేందుకు ఓ స్క్రిప్ట్ ప్రకారం చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. పెంగ్ స్వేచ్ఛ ఎంతవరకు తగ్గించబడిందో అంచనా వేయడం కష్టం? రెండు నెలల్లో శీతాకాల ఒలింపిక్స్ రానున్నాయి. అప్పటి కల్ల ఆమె సంకెళ్లు తొలగిపోవడమే కాకుండా, టెన్నిస్ కోర్టులోకి తిరిగి వచ్చినప్పుడే ఆమెకు స్వేచ్ఛ దొరికినట్లువుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళడానికి కూడా ఆమె ప్రయత్నించవచ్చు.
ఆమె ఆశ్చర్యకరమైన గాయంతో బాధపడినా, అనారోగ్యంతో పడిపోయినా లేదా ఆమె పదవీ విరమణ ప్రకటించినా సరే.. ఇందులో మాత్రం చైనా ప్రభుత్వ ఒత్తిడితోనే అలా జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చుట్టూ చైనా ప్రభుత్వం ఆవహించి ఉందని మాత్రం మనం తెలుసుకోవచ్చు.
నిజం చెప్పాలంటే ప్రపంచం తన నిరసనను వినిపించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అది చైనా. అక్కడ ఎలాంటి ప్రయత్నాలు పనిచేయవు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఛైర్మన్, CEO స్టీవ్ సైమన్, రెస్టారెంట్ వీడియో విడుదల తర్వాత పెంగ్ స్వేచ్ఛను ప్రశ్నిస్తూ ఒక బలమైన ప్రకటనను విడుదల చేశారు. “ఆమెను చూడటం సానుకూలంగా ఉన్నప్పటికీ, ఆమె స్వేచ్చగా ఉందా, బలవంతంగా అలా చేపించారా అనేది తెలియదు. ఇక నుంచి ఆమె ప్రభుత్వ జోక్యం లేకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలదా అనేది అస్పష్టంగా ఉంది” అని సైమన్ అన్నారు. “ఈ వీడియో ఒక్కటే సరిపోదు. నేను మొదటి నుంచి చెప్పినట్లుగా, పెంగ్ షుయ్ ఆరోగ్యం, భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. లైంగిక వేధింపుల ఆరోపణ సెన్సార్ చేయబడిందని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలా చేశారనేది మాత్రం నిజం.
అయితే ఇందుకు చైనాను హోస్ట్‌గా లేదా అంతర్జాతీయ క్రీడలో పాల్గొనకుండా బహిష్కరించడం అనేది భారీ చర్యలే. అది అంత సులభం కాదు. ఇలాంటి వాటిపై న్యాయంగా విచారణ చేస్తేనే ఫలితాలు వస్తాయి. లేదంటే ముందుముందు ఇలాంటివి ఎన్నో చూడాల్సి వస్తుంది.
-బిక్రమ్ వోహ్రా
రోహిత్ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?