తెలుగమ్మాయిల సత్తా: ప్రత్యూషకు సీఎం ప్రశంసలు..

|

Feb 29, 2020 | 8:53 AM

ఆమె ఏడేళ్లకే చదరంగంలో పతకం సాధించింది. గుర్తింపుతో సమానంగా వచ్చిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఛాంపియన్‌గా నిలిచింది. ఇటీవలే మరో ఘనత సాధించిన ప్రత్యూష.

తెలుగమ్మాయిల సత్తా: ప్రత్యూషకు సీఎం ప్రశంసలు..
Follow us on

ఆమె ఏడేళ్లకే చదరంగంలో పతకం సాధించింది. గుర్తింపుతో సమానంగా వచ్చిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఛాంపియన్‌గా నిలిచింది. ఇటీవలే ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌‌‌ని కూడా అందుకుంది. ఆ హోదా అందుకున్న మూడో తొలుగమ్మాయిగా గుర్తింపు పొందింది. ఆమే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు చెస్ క్రీడాకారిణి, మహిళా గ్రాండ్ మాస్టర్ బొడ్డా ప్రత్యూష. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ప్రత్యూషను ముఖ్యమంత్రి అభినందించారు.

ప్రపంచ వేదికలపై తెలుగమ్మాయిలు ఎనలేని సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరారు. ప్రభుత్వం తరపున సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రత్యూష వెంట ఆమె తల్లిదండ్రులు కూడా సీఎంను కలుసుకున్న సమయంలో ఉన్నారు. భారత్‌లో ఈ హోదా ఉన్న ఎనిమిదో క్రీడాకారిణి ప్రత్యూష. ఇప్పటిదాకా ఎనిమిది జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలు గెలిచింది ప్రత్యూష.

బొడ్డా ప్రత్యూష 2020 ఏడాది ఫిబ్రవరి లోనే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన జిబ్రాల్టర్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్ లో ప్రత్యూషకు మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ లభించింది. మూడేళ్ల క్రితం తొలి రెండు నార్మ్‌లు సాధించిన ప్రత్యూష.. ఇటీవల జిబ్రాల్టర్‌ టోర్నీలో మూడో నార్మ్‌ అందుకోవడం ద్వారా ఈ హోదా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మాత్రమే ఇప్పటివరకు మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సాధించారు.