Big Bash League: పాపం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.. ఈ వీడియోను మీరూ చూసేయండి..

Big Bash League: ఇంగ్లండ్ ఆలౌరౌండర్ లెవిస్ గ్రెగోరీ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇదో రకం ఆట అంటూ సెటైర్లు విసురుతున్నారు..

Big Bash League: పాపం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.. ఈ వీడియోను మీరూ చూసేయండి..

Updated on: Jan 01, 2021 | 1:35 PM

Big Bash League: ఇంగ్లండ్ ఆలౌరౌండర్ లెవిస్ గ్రెగోరీ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇదో రకం ఆట అంటూ సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియాలో బీబీఎల్ లీగ్ మ్యాచ్‌లు ‌జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హర్రీకేన్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. అయితే హోబర్ట్ హర్రీకేన్ ఇన్నింగ్స్‌ ఆడుతుండగా, బ్రిస్బేన్ హీట్ క్రికెటర్ లెవీస్ గ్రెగోరీ 17వ ఓవర్ బౌలింగ్ చేశాడు. 17వ ఓవర్‌లో టిమ్ డేవిడ్‌కు గ్రేగర్ బౌలింగ్ వేశాడు. అయితే ముందు వేసిన బాల్‌ను టిమ్ డేవిడ్ సిక్స్ బాదాడు. దాంతో తదుపరి బంతిని విభిన్నంగా వేయబోయాడు. అయితే ఆ ప్రయోగం కాస్తా విఫలమై.. నవ్వులపాలయ్యాడు గ్రెగోరీ. 17వ ఓవర్ చివరి బంతిని గ్రేగోరీ.. ఆఫ్-స్టంప్ వెలుపల ఆఫ్-కట్టర్ వేయబోయాడు. అయితే అది కాస్తా ఫెయిల్ అయ్యింది. బాల్ గ్రెగోరీ చేతి నుంచి స్లిప్ అయ్యి పిచ్‌కి ఆవలవైపు బంతి స్టప్ పడింది. దాంతో స్టేడియం మొత్తం నవ్వులు పూసింది. గ్రౌండ్‌లోని అంపైర్లు సహా, కామెంటేటర్లు నవ్వుకున్నారు. చివరికి బౌలింగ్ వేసిన గ్రెగోరీ కూడా కంట్రోల్ చేసుకోలేక నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ బౌలింగ్‌ను మీరూ చూసేయండి.

 

Also read:

TDP Leader Murder: ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. అమ్మవారిపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యే..

TDP Leader Murder: ఆ కాపీ వాళ్ల చేతికి ఎలా వెళ్లింది?.. నిలదీసిన సుబ్బయ్య భార్య అపరాజిత..!

 

BBL Tweet: