అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా తొలి విరామ సమయానికి 25 ఓవర్లు ముగిసే వరకు రెండు వికెట్లు కోల్పోయి 41 రన్స్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా రెండవ బంతికే ఔటయ్యాడు. స్టార్క్ వేసిన ఆ బంతికి షా క్లీన్‌బౌల్డయ్యాడు. మయాంక్ అగర్వాల్ కూడా 17 రన్స్ చేసి నిష్క్రమించాడు. తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ 5, పుజారా 17 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.