Ashok Dinda: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. వన్డే, టి20, టెస్ట్ ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్న ప్రకటించాడు. 2009లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దిండా క్రికెట్ కెరియర్ 2013లో ఇంగ్లడ్‌తో జరిగి వన్డేతో ముగిసింది. అప్పటి నుంచి రంజీ ట్రోఫీల్లో రాణిస్తూ వస్తున్నాడు. అయితే, 2019లో రంజీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ రణదేబ్ బోస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతని చర్యపై ఆగ్రహించిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్.. అశోక్ దిండాను క్రికెట్‌కు దూరంగా ఉంచుతూ వచ్చింది. బౌలింగ్ కోచ్ క్షమాపణలు చెబితే.. మళ్లీ అవకాశం కల్పిస్తామని క్యాబ్ ఆఫర్ ఇచ్చింది. అయితే అశోక్ దిండా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో క్యాబ్ కూడా అతన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలోనే అశోక్ దిండా తాజాగా అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
36 ఏళ్ల అశోక్ దిండా 2009లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన కెరియర్‌లో మొత్తం 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అదే సమయంలో 2019 జింబాబ్వేతో జరిగి మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న దిండా.. అంతర్జాతీయ వన్డేలోకి అరంగేట్రం చేశారు. తన కెరియర్‌లో మొత్తం 13 వన్డేలు ఆడిన దిండా.. చివరిసారిగా 2013లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ తరువాత టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. దాంతో 2013 నుంచి దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తూ వచ్చాడు. ఇటీవల జరిగిన సమ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దిండా ఆడాడు. కాగా, బెంగాల్ తరఫున 116 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన దిండా 420 వికెట్లు సాధించాడు. 98 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 151 వికెట్లు పడగొట్టాడు.
Also read:
Ujjwala Yojana: ఉచిత గ్యాస్ పథకానికి మీరు అర్హులా? అయితే ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..