టీ10 సమరానికి ‘యువీ’ రెడీ! 

| Edited By: Pardhasaradhi Peri

Aug 10, 2019 | 10:00 PM

గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ చెలరేగిపోతున్నాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదుతున్నాడు. తన జట్టు టొరంటో నేషనల్స్‌ను విజయతీరాలకు చేరుస్తున్నాడు. జీఎల్‌టీ20 తర్వాత అతడు టీ10 క్రికెట్‌ ఆడతాడని సమాచారం.యువీతో పాటు హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు కూడా ఈ లీగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. 2019 నవంబర్‌ 15 నుంచి టీ10 లీగ్‌ కొత్త సీజన్‌ ఆరంభం అవుతుంది. ‘మేం ఆశావహ దృక్పథంతో ఉన్నాం. ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు […]

టీ10 సమరానికి ‘యువీ’ రెడీ! 
Follow us on

గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ చెలరేగిపోతున్నాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదుతున్నాడు. తన జట్టు టొరంటో నేషనల్స్‌ను విజయతీరాలకు చేరుస్తున్నాడు. జీఎల్‌టీ20 తర్వాత అతడు టీ10 క్రికెట్‌ ఆడతాడని సమాచారం.యువీతో పాటు హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు కూడా ఈ లీగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. 2019 నవంబర్‌ 15 నుంచి టీ10 లీగ్‌ కొత్త సీజన్‌ ఆరంభం అవుతుంది.

‘మేం ఆశావహ దృక్పథంతో ఉన్నాం. ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు వస్తారని ఆశిస్తున్నాం. యువరాజ్‌పై కచ్చితమైన అంచనాలు ఉన్నాయి. మేం భారీ స్థాయిలో చెల్లించగలం. దాన్ని పక్కన పెడితే అంతరాన్ని పూడ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అతడు కచ్చితంగా ఆడతాడన్నది మా ఉద్దేశం. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న ఆటగాళ్లకూ ఇదే వర్తిస్తుంది. చర్చలు సాగుతున్నాయి’ అని టీ10 ఛాంపియన్‌షిప్‌ స్థాపకుడు షాజీ ఉల్‌ ముల్క్‌ అన్నారు.

యువరాజ్‌ లేదా అంబటి రాయుడు ఎంత మొత్తం కావాలని అడుగుతారో దానిని మేం జట్టు యజమానులకు తెలియజేస్తాం. అప్పుడు వారికి ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. సాధారణంగా యువీలాంటి ఆటగాడిని ఒకటి కన్నా ఎక్కువ జట్లు కోరుకుంటాయి. ఆ తర్వాత పేరును ముసాయిదాలో ఉంచుతాం. అప్పుడు ఎవరు ఎంచుకుంటారో చూడాలి’ అని షాజీ వెల్లడించారు. ఇయాన్‌ మోర్గాన్‌, డారెన్‌ సామి, ఆండ్రీ రసెల్‌, షాహిద్‌ అఫ్రిది తిరిగి వస్తున్నారని ఆయన తెలిపారు. భారత్‌ నుంచి జహీర్‌ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఆర్పీసింగ్‌, ప్రవీణ్‌ తంబె టీ10 క్రికెట్‌ ఆడిన సంగతివిదితమే.