
టెస్టు క్రికెట్ లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ ముందు వరసలో ఉంటారు. ఎంతోకాలం భారత క్రికెట్ కు సేవలందించిన గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్… ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆయన పేరిట ఉన్న ఓ రికార్డును శనివారం ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది ఐసీసీ.
“31,258 – టెస్టు క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ ఆడిన బంతులు. ఇప్పటివరకు ఏ ఆటగాడు కనీసం 30వేల బంతులను ఎదుర్కొలేకపోయారు . ప్రతీ టెస్టులో సగటున 190.6 బంతులు ఆడేవారు ద్రవిడ్” అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
1994 నుంచి 2012 వరకు భారత క్రికెట్‌కు సేవలందించారు ద్రవిడ్. మొత్తం 164 టెస్టులు ఆడారు. ఆయన కన్నా మరో నలుగురు టాప్ బ్యాట్స్‌మన్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడినా… ఎవరూ ద్రవిడ్ అన్ని బంతులు ఎదుర్కొనలేదు. సచిన్ 200 టెస్టులు ఆడి 29,437 బంతులు ఆడారు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలిస్ 166 మ్యాచ్‌లు ఆడి 28,903 బంతులు ఎదుర్కొన్నారు. విండీస్ మాజీ ప్లేయర్ ఎస్.చంద్రపాల్ 27,395, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ 27,072 డెలివరీలు ఎదుర్కొన్నారు.