Yearly Horoscope: కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి..

| Edited By: Ravi Kiran

Dec 31, 2022 | 7:19 PM

ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. జనవరి 18 తో ఏలినాటి శని ముగుస్తున్నందువల్ల మనసులోని కొన్ని కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి.

Yearly Horoscope: కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి అన్నింటా విజయాలే.. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి..
Horoscope
Follow us on
  • మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

జనవరి 18న శని కుంభరాశిలోకి, ఏప్రిల్ 23న గురువు మేషరాశిలోకి, అక్టోబర్ 24న రాహువు మీన రాశిలోకి, కేతువు కన్యారాశిలోకి మారుతున్నందువల్ల ఈ రాశి వారు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రావడం లేదా మరింత మంచి సంస్థల్లో ఉద్యోగాలు రావడం వంటివి జరుగుతాయి. సంవత్సరంలో ఎక్కువ భాగం సానుకూల ఫలితాలే అనుభవానికి వస్తాయి. ఈ రాశి వారికి శని లాభ స్థానంలోకి రావడం వల్ల కొన్ని ముఖ్యమైన ఆశలు, కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరటానికి అవకాశం ఉంది. వివాహం కోసం నిరీక్షిస్తున్న వారికి తప్పకుండా మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి చాలావరకు పరిష్కారం కావచ్చు. పిల్లలు ఊహించనంతగా పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడతారు. విదేశాల్లో చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం అటువంటి కోరికలు నెరవేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఐటీ నిపుణులు, ఇతర వృత్తి వ్యాపారాల వారు ఆర్థికంగా ముందుకు దూసుకు వెళతారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. అయితే, ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.

  • వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ సంవత్సరం జనవరి 18 తర్వాత నుంచి ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, ఆర్థికంగా మంచి కాలం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారు లాభాల పంట పండించుకుంటారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమానికి నడుం బిగిస్తారు. వివాహం కాని వారికి పెళ్లి యోగం ఉంది. ఉద్యోగులకు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లలు వృద్దులోకి వస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. విదేశాల్లో ఉంటున్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవితానికి సంబంధించి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి.

  • మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

జనవరి 18 తరువాత శని కుంభరాశిలో ప్రవేశించడం, గురు రాహువులు లాభ స్థానంలో యుతి చెందడం ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగించబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అదృష్టం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా కూడా అధికార యోగం పట్టే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించి స్థిరపడటానికి అవకాశం ఉంది. వ్యాపారులు భాగస్వాములతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని విస్తరించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో మార్పు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారు ఏప్రిల్ 23 తర్వాత మంచి ఉద్యోగంలోకి మారటానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి బంధువర్గంలోనే సంబంధం కుదిరే అవకాశం ఉంది. జీవితం కొన్ని శుభ పరిణామాలతో మంచి మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణాల వల్ల లాభపడతారు. పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారికి సంతానయోగం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. భారీగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది.

  • కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

జనవరి 18 తర్వాత నుంచి ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 23 నుంచి గురువు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు మార్పుల కారణంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించబోతున్నారు. ఉద్యోగపరంగా తరచూ విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతలను తీసుకోవలసి వస్తుంది. ఇక అష్టమ శని కారణంగా ఈ సంవత్సరం అంతా కొన్ని ఊహించని చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ పరంగా ఆచితూచి కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. నమ్మిన వారు మోసగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అతి జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బంధువులతో అపార్ధాలు తలెత్తుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కోర్టు కేసులు ఈ సంవత్సరం కూడా పరిష్కారం కాకపోవచ్చు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి.

  • సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ, వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలపరంగా చిన్నచిన్న సమస్యలు అనుభవానికి వస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాలతో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు విషయంలో తొందరపాటు పనికిరాదు. స్నేహితులను కానీ, సభ్యులను కానీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అద్దె ఇంట్లో ఉన్నవారైతే ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి కాని వారికి ఎన్నో ప్రయత్నాలు అనంతరం సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఉన్నవారు కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ, పెట్టుబడులు పెంచటం గాని చేయకపోవడం మంచిది. మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పటికీ ఇతరులకు మాత్రం బాగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నమ్మిన వారు కొందరు డబ్బు నష్టం కలిగిస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగించవు. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అంది, అవసరాలు తీరుతాయి. ప్రేమ వ్యవహారాలు మందకోడిగా నడుస్తాయి. విద్యార్థులకు పర్వాలేదు.

  • కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

జనవరి 18న శని ఆరవ స్థానంలో ప్రవేశించడం వల్ల ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరానికి తగ్గ డబ్బు చేతికి అందడం వల్ల రుణ సమస్యలు చాలావరకు తగ్గించుకుంటారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం. అయితే, ఏ ఉద్యోగంలో చేరినప్పటికీ బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. శ్రమ, ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. ఏప్రిల్ 23 నుంచి గురు గ్రహం 8వ రాశిలో ప్రవేశించడం వల్ల, అక్కడ రాహువుతో యుతి చెందడం వల్ల కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. బంధువులతో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. అనవసర వస్తువుల మీద దుబారా చేయడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కొత్త కార్యక్రమాలను లేదా శుభకార్యాలను ఒక ఏడాది పాటు వాయిదా వేయటం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ఫలించకపోవచ్చు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా ఆశించినంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు.

  • తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశి వారికి శని గురువుల మార్పు చాలా యోగిస్తుంది. అదృష్ట యోగం పడుతుంది. అధికార యోగానికి, గృహ, వాహన సౌఖ్యాలకు అవకాశం ఉంది. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. పెళ్లి కాని వారికి బంధు వర్గంలో మంచి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఊహించనంతగా పురోగతి సాధించే సూచనలున్నాయి. ఆరోగ్యం మీద మాత్రం ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. దూర ప్రయాణాలకు లేదా తీర్థయాత్రలకు అవకాశం ఉంది. సంతానయోగం కలుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఐటి తదితర వృత్తుల వారు విదేశీ ప్రయాణాలకు, విదేశీ ఉద్యోగాలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించవచ్చు. వ్యాపారులు విశేషంగా లాభాలు గడిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెళతారు. ఆర్థిక లావాదేవీలు ఆశించినంతగా ప్రయోజనం కలిగిస్తాయి. కోర్టు కేసులు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు.

  • వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఇల్లు గాని స్థలం కానీ కొనే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్థాయి. బంధువులతో వ్యవహరించేటప్పుడు అపార్ధాలు తలెత్తకుండా మాట్లాడాల్సి ఉంటుంది. స్నేహితుల నుంచి అండదండలు లభిస్తాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. బాగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఐటీ తదితర వృత్తుల వారు బాగా రాణిస్తారు. వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వర్గాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభకార్యాల మీద బాగా వ్యయం జరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. కోర్టు కేసులు అంతగా ఆశాజనకంగా ఉండవు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

  • ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. జనవరి 18 తో ఏలినాటి శని ముగుస్తున్నందువల్ల మనసులోని కొన్ని కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించడం జరుగుతుంది. వృత్తుల్లో ఉన్నవారు మంచి రంగాల్లో స్థిరపడతారు. అదృష్ట యోగానికి, ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి తీపి సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఒకరిద్దరు స్నేహితులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. డబ్బు నష్టం కూడా జరగవచ్చు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాక అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాల మీద మితిమీరి ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి. పిల్లలు విశేషంగా పురోగతి సాధిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా పాజిటివ్ గా ఉండటం మంచిది. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. ఆస్తి విలువ ఆశించిన స్థాయిలో పెరుగుతుంది.

  • మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

జనవరి 18 నుంచి శని కుంభరాశిలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఉద్యోగపరంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. నాలుగవ రాశిలోకి, అంటే మేషరాశిలోకి గురువు ప్రవేశించడం వల్ల గృహ యోగానికి, వాహన యోగానికి అవకాశం ఉంది. అయితే అక్కడ రాహు కూడా ఉండటం వల్ల మధ్య మధ్య కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు, తిప్పట, ఒత్తిడి లాంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో ఉన్నత విద్యకు, విదేశాల్లో వ్యాపారానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు ఎలా ఉంటాయి. స్నేహితులకు, బంధువులకు ఆర్థికంగా సహాయం చేసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా ప్రమోషన్లు, మంచి ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ సంబంధమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు యధాతధంగా కొనసాగుతాయి. కోర్టు కేసులు ఒక పట్టాన కొలిక్కి రావు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. వ్యసనాలను అలవాటు చేసుకోవద్దు.

  • కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

జనవరి 18 తర్వాత శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఈ రాశి వారికి శని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ, చివరికి మంచి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశి వారికి శని ఒక విధంగా యోగించడం విశేషం. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయదలుచుకున్న వారికి వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటే, ఈ రాశి వారు అన్ని విధాలుగాను పురోగతి చెందటమే జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఐటీ నిపుణులకు విదేశీ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో సహచరులకు అండగా నిలుస్తారు. ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. సహనంతో వ్యవహరిస్తే మీకు ఈ ఏడాది అంతా మంచే జరుగుతుంది. ఇతరుల సమస్యలను తలదూర్చవద్దు. విద్యార్థులు శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా అనుకూలంగా ఉండవు. కోర్టు కేసులు సాచివేత ధోరణిలో కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు.

  • మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశి వారికి జనవరి 18 నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతున్నప్పటికీ ఇది పెద్దగా సమస్యలు సృష్టించే అవకాశం లేదు. నిజానికి, శని ఈ రాశికి 12వ రాశిలో ఉండగా, విదేశాల్లో ఉద్యోగాలకి, దేశాలలో చదువులకి, విదేశీయానానికి అవకాశం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, శుభకార్యాల మీద డబ్బు బాగా ఖర్చు అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో పెళ్లి, గృహప్రవేశం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ పరంగా తీసుకునే కొత్త నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి. పిల్లలు ఎంతో శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ధనస్థానంలో గురు రాహువులు కలిసి ఉండటం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. గతంలో చేసిన ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులను సంప్రదించి తీసుకుంటే మంచిది. కుటుంబంలో ఒక ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.