Vinayaka Chavithi 2025: వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే పూజా ఫలితం దక్కదు

వినాయక చవితి పండుగను హిందువులు వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగను గణేష చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ రోజున గణపతి బప్పా భూమిపైకి వస్తాడని నమ్మకం. అందుకనే విఘ్నాలకధిపతి పుట్టిన రోజున గణపతి అనుగ్రహం కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గణపయ్య అనుగ్రహం లభిస్తే జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని.. పనిలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. అయితే ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించే ముందు కొన్ని నియమాలను పాటించాలి. లేకుండా పూజ చేసినా ఫలితం ఉందని నమ్మకం.

Vinayaka Chavithi 2025: వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే పూజా ఫలితం దక్కదు
Vinakaya Chavithi

Updated on: Aug 20, 2025 | 4:55 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని బుధవారం, 27 ఆగస్టు 2025న జరుపుకుంటారు. ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు గణపతి బప్పాను తమ ఇళ్లలో ప్రతిష్టించడం గణపతి పూజని నిర్వహిస్తారు. గణపతి జ్ఞానం, శ్రేయస్సు , అదృష్టానికి దేవుడిగా పరిగణించబడతాడు. గణపతి విగ్రహ ప్రతిష్టకు ముందు, పూజ సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ నియమాలను జాగ్రత్తగా పాటించకపోతే పూజ చేసినా పూర్తి ప్రయోజనం లభించదు. మీ పూజ పరిపూర్ణం కావాలంటే కావడానికి బప్పా ప్రతిష్టకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి..

గణేష్ చతుర్థి శుభ సమయం
దృక్ పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి ఆగస్టు 26, 2025 మధ్యాహ్నం 01:54 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27, మధ్యాహ్నం 03:44 గంటల వరకు ఉంటుంది. గణపతిని ప్రతిష్టించి పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం ఆగస్టు 27, 2025. ఈ రోజున ఉదయం లేదా మధ్యాహ్నం శుభ సమయంలో గణపతి పూజను చేయవచ్చు. సెప్టెంబర్ 6, 2025న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ రోజు అనంత చతుర్దశి రోజు.

గణేష్ ప్రతిష్టించే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నియమాలు

గణపతి తొండం: గణపతి విగ్రహ తొండం ఎడమ వైపుకు వంగి ఉండే విగ్రహాన్ని కొనండి. ఇటువంటి విగ్రహాన్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కుడి వైపుకు వంగి ఉన్న తొండం ఉన్న విగ్రహాన్ని సిద్ధివినాయక రూపంగా పరిగణిస్తారు. కనుక ఈ ఇతరహా విగ్రహం ఇంట్లో ప్రతిష్ఠిస్తే పూజకు కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి.

స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి: గణేశ విగ్రహాన్ని ఉంచే ముందు ప్రార్థనా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి..అక్కడ గంగా జలాన్ని చల్లుకోండి.

పీఠం, లేదా ఆసనం: విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచవద్దు. విగ్రహాన్ని ఎరుపు లేదా పసుపు వస్త్రంతో కప్పబడిన శుభ్రమైన పీఠం లేదా దర్భాసనంపై ఉంచండి.

మట్టి విగ్రహం: శాస్త్రాల ప్రకారం మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం: గణేష్ విగ్రహాన్ని చతుర్థి తిథి నాడు మాత్రమే ప్రతిష్టించండి. రాత్రి సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణించబడదు.

దిశ: గణేశుడి విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. ఈ దిశ పూజకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

పరిమాణం: విగ్రహం పరిమాణం చాలా పెద్దదిగా ఉండకూడదు. ఇంట్లో పూజకు, సులభంగా నిమజ్జనం చేయగల చిన్న విగ్రహం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.

అభిషేకం, ప్రాణ ప్రతిష్ఠ: విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత అభిషేకం చేయండి. దీని తరువాత “ప్రాణ ప్రతిష్ఠ” మంత్రాన్ని జపించడం ద్వారా విగ్రహంలోకి ప్రాణం పోయండి.

సిందూరం, దర్భ ప్రాముఖ్యత: గణేశుని పూజలో సిందూరం , దర్భ గడ్డిని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

మోదకాలు నైవేద్యం: గణపతి బప్పాకు మోదకాలు అంటే ఇష్టం. కనుక వీటిని చవితి రోజున సమర్పించడం తప్పనిసరి. ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లేడు కాయలు ఆయనకు ఇష్టమైన ప్రసాదం అని నమ్ముతారు.

క్రమం తప్పకుండా పూజలు: ప్రతిష్టించిన తర్వాత.. ఆచారాల ప్రకారం ప్రతి ఉదయం, సాయంత్రం గణేశునికి హారతి ఇవ్వడం, పూజ చేయడం, నైవేద్యాన్ని సమర్పించడం అవసరం.

ఉపవాసం ఆచారం: భక్తులు వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం చేసే వరకూ నిర్జల లేదా ఫలహార ఉపవాసం పాటిస్తారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ ఆనందం , శ్రేయస్సు మరియు పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us