TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. గదుల కోటా విడుదలకు ముహుర్తం ఖరారు. ఎప్పుడంటే..

|

Jun 24, 2023 | 5:07 PM

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్‌ చేసింది. గదుల కోటాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 26వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి భక్తులు గదులను బుక్‌ చేసుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్‌....

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. గదుల కోటా విడుదలకు ముహుర్తం ఖరారు. ఎప్పుడంటే..
TTD NEWS
Follow us on

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్‌ చేసింది. గదుల కోటాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 26వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి భక్తులు గదులను బుక్‌ చేసుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించి ఒకేసారి కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమల, తిరుపతితో పాటు తలకోన ప్రాంతాల్లోని గదులను బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా గదులు బుక్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. భక్తుల కోసం రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే గదుల కోటాను సైతం విడుదల చేయనుంది.

అంతే కాకుండా జూల్‌ నెలలోనే ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదిక్షిణం టికెట్లను సైతం టీటీడీ ఇటీవలే విడదుల చేసింది. ఇదిలా ఉంటే టికెట్ల విషయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి పోసపోవద్దని తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..