TTD Darshan Tickets: కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్లు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి నెలలో దాదాపు 14లక్షల మంది భక్తులకు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చిలో రోజుకు 25వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల (Darshan Tickets) ను ఈరోజు (బుధవారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 9 గంటలకు టికెట్లను విడుదల చేయనుంది. అలాగే మార్చిలో రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతిలో విక్రయించనున్నట్లు టీటీడీ (Tirumala Tirupati Devasthanam) తెలిపింది. టికెట్ల కోసం https://www.tirumala.org/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
టికెట్ల బుకింగ్ కోసం డైరెక్ట్‌గా ఈ లింకును క్లిక్ చేయండి..
ఇదిలాఉంటే.. రేపటి నుంచి (24వ తేదీ) ఈనెల 28 వరకు అదనపు కోటా టికెట్లను కూడా టీటీడీ జారీ చేయనుంది. నాలుగు రోజులపాటు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు ఐదువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను కౌంటర్ల వద్ద ఇవ్వనున్నట్లు టీడీటీ అధికారులు తెలిపారు.
Also Read: