Tirumala: తిరుమలలో మరోసారి నిబంధనలకు తిలోదకాలు.. వెలుగు చూసిన సిబ్బంది అక్రమాలు..

తిరుమల ఆలయ నిబంధలను ఉల్లంఘిస్తూ బయోమెట్రిక్ గుండా కొందరు భక్తులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడం వివాదంగా మారుతోంది. చైర్మన్ కార్యాలయ సిబ్బందితో

Tirumala: తిరుమలలో మరోసారి నిబంధనలకు తిలోదకాలు.. వెలుగు చూసిన సిబ్బంది అక్రమాలు..
Tirumala
Follow us

|

Updated on: Feb 17, 2022 | 11:59 AM

తిరుమల ఆలయ నిబంధలను ఉల్లంఘిస్తూ బయోమెట్రిక్ గుండా కొందరు భక్తులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడం వివాదంగా మారుతోంది. చైర్మన్ కార్యాలయ సిబ్బందితో ఆలయ ప్రవేశం నిర్వహించారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఘటన చోటు చేసుకుంది. దర్శనాంతరం చైర్మన్‌తో పాటు భక్తులు బయటకు వచ్చారు. ఆలయ నిబంధనల ఉల్లంఘనపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొటో కాల్ దర్శనం పేరిట వారు భక్తులను లోపలికి తీసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. విఐపి బ్రేక్ దర్శనం సమయంలో ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిబ్బంది ఆలయ నిబంధనలను ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. బయోమెట్రిక్ చేయకుండానే కొందరిని లోపలికి తీసుకెళ్లే దృశ్యాలను సీసీ టీవీ కెమెరాల్లో పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు. ఆ సిబ్బందిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇలాంటివారి గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.

తిరుమల బయో మెట్రిక్ ప్రవేశంపై బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వారిని ఆలయంలోకి ఎవరు తీసుకెళ్లారో టీటీడీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి అన్నారు. చైర్మన్ కార్యాలయ సిబ్బందే కొందరు భక్తులను బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోకి తీసుకెళ్లారని ఆరోపణలు వినిపిస్తుడటం దారుణం అని అన్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి భక్తులకు సమాధానం చెప్పాలన్నారు బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి.

ఇలావుంటే.. తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి కీలక సమావేశం మొదలైంది. వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలపనుంది. 3 వేల 171 కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. ఈసారి వెయ్యి కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొన్ని కీలక అంశాలపై టీటీడీ బోర్డు మీటింగ్‌లో చర్చించనున్నారు. శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు.. ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్సీని టీటీడీలో అమలు చేయాలని కూడా బోర్డు భావిస్తోంది.

ఇవి కూడా చదవండి: CM KCR Birthday: ఏపీలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు.. కడియం రైతుల వినూత్న శుభాకాంక్షలు..

AP Politics: చిక్కుల్లో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్.. ఆళ్లగడ్డలో మళ్లీ కేసు.. ఈసారి కేసు పెట్టింది ఎవరో తెలుసా..