Zodiac Signs: ఈ మూడు రాశుల వారు సినిమా చూస్తూ ఏడుస్తారట.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

| Edited By: Ravi Kiran

Aug 30, 2021 | 6:13 AM

Zodiac Signs: సినిమాలు అంటే కొందరికి పిచ్చి. తెగ చూసేస్తుంటారు. అయితే, చాలా వరకు సినిమాలు భావోద్వాలతో ముడిపడి ఉంటాయి. కొన్ని సీన్లు మనుషులను..

Zodiac Signs: ఈ మూడు రాశుల వారు సినిమా చూస్తూ ఏడుస్తారట.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..
Rasi Falalu
Follow us on

Zodiac Signs: సినిమాలు అంటే కొందరికి పిచ్చి. తెగ చూసేస్తుంటారు. అయితే, చాలా వరకు సినిమాలు భావోద్వాలతో ముడిపడి ఉంటాయి. కొన్ని సీన్లు మనుషులను ఇట్టే ఆకట్టుకుంటాయి. భావోద్వేగంతో కూడిన సీన్స్ వచ్చినప్పుడు మనుషుల్లో ఆటోమాటిక్‌గా కళ్ల వెంట నీరు వస్తుంది. అయితే, కొందరు తమ భావోద్వేగాలను నియంత్రించుకుంటే.. మరికొందరు నియంత్రించుకోలేకపోతారు. బోరున విలపిస్తారు. ఇంకొందరైతే.. ఆ సీన్స్‌ చూడలేక బయటకు వెళ్లిపోతారు. ఇలాంటి వారి గురించి జ్యోతిష్య శాస్త్రం ఆసక్తికర విషయాలు చెబుతోంది. దాదాపు అందరిలోనూ భావోద్వేగాలు ఉంటాయి. అయితే, వాటిని అందరూ కంట్రోల్ చేసుకోలేదు. కొందరు తమను తాము నియంత్రించుకుంటే.. మరికొందరు తమ భావాలను నియంత్రించుకోలేరు. సినిమాల్లోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలను చూసి ఏడుపు లంకించుకుంటారు. అయితే, సినిమాలు చూసేటప్పుడు ప్రధానంగా ఈ మూడు రాశుల వారు ఏడుస్తారట. కొందరు భావోద్వేగ సన్నివేశాలు వచ్చినప్పుడు.. మరికొందరు రొమాన్స్ సీన్స్ వచ్చినప్పుడు.. ఇంకొందరు ఫన్నీ మూమెంట్స్ వచ్చినప్పుడు ఆటోమాటిక్‌గా ఏడ్చేస్తారట. మరి జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ఆ మూడు రాశుల వారు ఎవరో తెలుసుకుందాం..

కర్కాటకం:
ఈ రాశి వారు చాలా సున్నిత మనస్కులు. వారు ఊరికే భావోద్వేగానికి గురవుతుంటారు. చిన్న విషయాలకు కూడా నొచ్చుకుంటారు. ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా సినిమాలు చూసే సమయంలో వీరు చాలా వీక్ అని చెప్పాలి. సెంటిమెంటల్ సన్నివేశాలు, భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు వస్తే.. వారు వెంటనే ఏడుస్తారట. తమలోని భావోద్వేగాలను వారు నియంత్రించుకోలేరట.

మీనం:
ఈ రాశి వారు కూడా సున్నితమైన వారు. ఈ రాశి వారు పగటి కలలు కంటుంటారు. సినిమాలో రొమాంటిక్ సీన్స్, ఇతర శృంగారభరిత సన్నివేశాలు వచ్చినప్పుడు ఈ రాశివారి కంటి వెంట నీరు కారుతుందట. ఈ సీన్ అంతా వారు ఏడుస్తూనే ఉంటారట.

తులారాశి:
తుల రాశి వారికి పైకి కఠినంగా కనిపిస్తారు కానీ.. చాలా సున్నిత మనస్కులు ఇతరుల పట్ల విపరీతమైన సానుభూతి కనబరుస్తారు. మృదు స్వభావులు. ఎవరైనా ఆపదలో, గడ్డుపరిస్థితుల్లో ఉంటే వారికి సాధ్యమైనంత మేరకు సాయం చేస్తారు. ఇక సినిమా విషయానికి వస్తే.. బాధాకరమైన దృశ్యాలు, సన్నివేశాలు, సెంటిమెంట్, ఇతరులు బాధపడే సీన్స్ చూసి కన్నీరుమున్నీరవుతారు.

Also read:

Shocking News: విరిగిపోయిన చెట్టు కొమ్మ అని పక్కనే నిల్చున్నాడు.. అసలు మ్యాటర్ తెలియడంతో పరుగులు తీశాడు..

Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..

Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..