సకల దరిద్రాలను పోగొట్టే అరుదైన అమావాస్య.. ఆదివారం ఈ సమయంలో పూజలు చేస్తే తిరుగుండదు..

అధికమాసంలో ఆదివారంతో కూడిన అమావాస్య తిథి అత్యంత అరుదైనది.. విశేష శక్తి కలిగినది. శాస్త్రాల ప్రకారం, ఈ రోజు చేసే స్నానం సూర్యగ్రహణ స్నానంతో సమానమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే, కొద్దిగా జపం చేసినా అనంతమైన, అక్షయమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది. ఆదివారం అమావాస్యను "సిద్ధయోగం" అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు చేసే సాధనలు జీవితంలో గొప్ప మలుపులు తెచ్చిపెడతాయి.

సకల దరిద్రాలను పోగొట్టే అరుదైన అమావాస్య.. ఆదివారం ఈ సమయంలో పూజలు చేస్తే తిరుగుండదు..
Adhikamasam Amavasya

Updated on: Jun 14, 2026 | 12:17 PM

అధికమాసంలో ఆదివారంతో కూడిన అమావాస్య తిథి అత్యంత అరుదైనది.. శక్తివంతమైనది, అద్భుతమైన ఫలితాలను ప్రసాదించే పుణ్య దినం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రంలో ఈ తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పాటించే కొన్ని ముఖ్యమైన విధివిధానాల ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరి, కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్ర వచనం చెబుతోంది.. సోమవతి అమావాస్య తిథి జూన్ 14 మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమై జూన్ 15 ఉదయం 8:24 గంటలకు ముగుస్తుంది. అమావాస్య సోమవారం (సోమవారం) నాడు వస్తుంది.. కాబట్టి దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు.

శాస్త్ర ప్రమాణాలు – ప్రాముఖ్యత:

ఆదివార అమావాస్య విశిష్టత

స్నాన మహత్యం: “రవివారే యదా దేవి అమావాస్య ప్రజాయతే సూర్య గ్రహణ తుల్యాసా తత్ర స్నానం మహా ఫలం” అని శాస్త్రం చెబుతుంది. అంటే, ఆదివారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు చేసే స్నానం సూర్యగ్రహణం రోజు చేసే స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది.

జప విశిష్టత: “అమావారే రవేర్వారే యత్కించిత్ క్రియతే జపం తత్సర్వం అక్షయం ప్రోక్తం సాధకానాం జయప్రదం” అని మరొక శ్లోకం. ఈ రోజు కొద్దిగా జపం చేసినా అనంతమైన, అక్షయమైన ఫలితాలు కలుగుతాయి. సాధకులకు గొప్ప విజయాలు చేకూరుతాయి. మామూలు రోజుల్లో కోట్ల సార్లు జపించిన ఫలితం ఈ రోజు ఒక 21 సార్లు మంత్రాన్ని చదవడమే లభిస్తుందని నమ్మకం.

సిద్ధయోగం: “అక్కవారే అమావాస్యాం సిద్ధయోగః ప్రకీర్తితః తస్మిన్ కాలే కృతా సాధనా పునరావృత్తి వర్జితా” అని శాస్త్రం ప్రకారం, ఆదివారం అమావాస్యను “సిద్ధయోగం” అంటారు. ఈ రోజు చేసే ప్రత్యేక పూజలు జీవితంలో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా గొప్ప మలుపులను తెచ్చిపెడతాయి.

పూజా విధానాలు:

అమ్మవారి ఆరాధన: అమావాస్య దేవతలందరూ పూజించే పుణ్యతిథి. ఈ రోజు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించడం వల్ల కోటి రెట్లు విశేషమైన ఫలితం లభిస్తుంది.

నిమ్మదీపాల పూజ: సాయంకాలం రాహుకాల సమయంలో (సాధారణంగా సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య) ఇంటి బయట ఆవరణలో లేదా తులసి కోట దగ్గర ఒక పీట ఉంచి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీటపై బియ్యప్పిండితో షట్కోణం అష్టదళ పద్మం ముగ్గులను వేయాలి

షట్కోణం: ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం కలిపితే షట్కోణం అవుతుంది. దీని ఖండన బిందువులు ఆరు, అలాగే త్రికోణాల బిందువులు ఆరు కలిపి మొత్తం 12 బిందువుల వద్ద 12 నిమ్మదొప్ప దీపాలను ఉంచాలి.

పులిహోరను నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి.

ఫలితాలు: ఈ పూజ చేయడం వల్ల నర పీడ, దృష్టి దోషాలు, శత్రు బాధలు, కుటుంబ విభేదాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వీలైనవారు దుర్గా, కాళి, చండి, మహిషాసుర మర్ధిని వంటి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ దీపాలను వెలిగించడం వల్ల మరింత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ దీపాలు వెలిగించలేని వారు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయించుకోవచ్చు.

శివారాధన: ఆదివారం అమావాస్య నాడు ఈశ్వరుడిని పూజించడం వల్ల సర్వ పాపాలు భస్మమై, మరణానంతరం శివలోకం చేరుకుంటారు. శివాలయంలో దీపారాధన, ప్రదక్షిణలు, దర్శనం చేయడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది.

అశ్వత్థ వృక్ష పూజ (రావిచెట్టు పూజ): రావిచెట్టు రూపంలో విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి, ఆదివారం అమావాస్య నాడు రావిచెట్టుకు పూజలు చేసి, ప్రదక్షిణలు చేయడం వల్ల మహా ఫలం, విష్ణు అనుగ్రహం లభిస్తాయి. మధ్యాహ్నం 2:20 తర్వాత రావిచెట్టు పూజ చేయవచ్చు.

దానధర్మాలు: పూజలు చేయలేని వారు లేదా ఆలయానికి వెళ్లలేని వారు దానధర్మాలు చేయడం ద్వారా అద్భుత ఫలితాలు పొందవచ్చు. అధిక మాసంలో వచ్చే ఆదివార అమావాస్య సందర్భంగా తేనె, మినప్పప్పు, ముల్లంగి, గోధుమలు లేదా బెల్లం వంటివి దానం చేయడం శ్రేష్ఠం.

అధికమాసం ప్రత్యేకత: ఈ అన్ని పూజా విధానాలకు అధికమాసం మరింత విశిష్టతను ఇస్తుంది. “అధికస్య అధికం ఫలం” అన్నట్లుగా, అధిక మాసంలో చేసే పూజలు, దానధర్మాలు సాధారణ సమయాల కంటే ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి, అనేక సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన, శక్తివంతమైన ఆదివార అమావాస్యను సద్వినియోగం చేసుకొని, శుభ ఫలితాలను అందుకోవాలి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us