Pradosha Vratam: రేపే ప్రదోష వ్రతం.. ఈ శుభ సమయంలో శివపార్వతులను పూజించండి.. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది..

ప్రదోష వ్రతం ఉపవాసం ఆది దంపతులైన శివ పార్వతులకు అంకితం చేయబడింది. ఈ రోజు శివయ్యని పూజిస్తూ ఉపవాసం చేయడం వలన ఆశించిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మే నెలలో మొదటి ప్రదోష వ్రతం, ఉపవాసం పూజకు ఎప్పుడు శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం..

Pradosha Vratam: రేపే ప్రదోష వ్రతం.. ఈ శుభ సమయంలో శివపార్వతులను పూజించండి.. దంపతుల మధ్య  అనురాగం పెరుగుతుంది..
Pradosha Vatam

Updated on: May 08, 2025 | 8:21 PM

ప్రదోష వ్రతం అనేది శివ పార్వతులకు అంకితం చేయబడిన రోజు. ఈ ఉపవాసం ప్రతి నెల త్రయోదశి తిథి రోజున చేస్తారు. ఈ ప్రదోష వ్రతం శుక్ల, కృష్ణ పక్షాలలో వస్తుంది. ఈసారి ప్రదోష వ్రతం రేపు జరుపుకోనున్నారు. ఈ రోజు శివ భక్తులకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ప్రదోష ఉపవాసం రోజున, శివుడు, పార్వతిని కలిసి పూజిస్తారు. ఈ రోజున శివుడు చాలా సంతోషంగా ఉంటాడు .. తన భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. ముఖ్యంగా పిల్లలు, ఆనందం, శ్రేయస్సు , వైవాహిక జీవితానికి సంబంధించిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

ప్రదోష ఉపవాస తేదీ

వేద క్యాలెండర్ ప్రకారం మే నెలలో మొదటి ప్రదోష ఉపవాసం అంటే వైశాఖ మాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి మే 9న మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు అంటే మే 10న సాయంత్రం 5:29 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో మే నెలలో మొదటి ప్రదోష ఉపవాసం మే 9న పాటించబడుతుంది.

ప్రదోష ఉపవాస శుభ సమయం

పంచాంగం ప్రకారం మే నెల మొదటి ప్రదోష ఉపవాసం రోజున భోలేనాథ్‌ను పూజించడానికి శుభ సమయం సాయంత్రం 7:01 నుంచి 9:08 వరకు ఉంటుంది. ఈ సమయంలో భక్తులకు పూజలు చేయడానికి మొత్తం 2 గంటల 6 నిమిషాలు సమయం లభిస్తుంది. ఈ శుభ సమయంలో శివుడిని పూజించడం ద్వారా శివయ్య ఆశీస్సులను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రదోష ఉపవాస పూజా విధానం

ప్రదోష ఉపవాసం రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసి, గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి. శివపార్వతులతో పాటు నంది ఉన్న విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. పూజ కోసం పండ్లు, పూలు, ధూపం, దీపాలు, నైవేద్యం (ఖీర్ లేదా స్వీట్లు), బిల్వ పత్రాలు, నీరు, పంచామృతం (పాలు, పెరుగు, నెయ్యి, తేనె , చక్కెర మిశ్రమం) మొదలైన వాటిని సేకరించండి. ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. శివుడిని, పార్వతి తల్లిని, నందిని ప్రార్థించండి. శివలింగానికి జలాభిషేకం చేయండి.

పంచామృతంతో అభిషేకం కూడా చేయవచ్చు. శివుడికి బిల్వ పత్రాలు, పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించండి. ధూపం, దీపాలు వెలిగించండి. “ఓం నమః శివాయ” వంటి శివుని మంత్రాలను జపించండి. శివ చాలీసా కూడా పారాయణం చేయవచ్చు. ప్రదోష వ్రతం కథ వినండి లేదా చదవండి. శివపార్వతులకు హారతి ఇవ్వండి. చివరగా పూజ సమయంలో తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని కొరుకొండి. మీ కోరికలను దేవునికి చెప్పండి.

ప్రదోష వ్రత ప్రాముఖ్యత

ప్రదోషం అంటే “దోషాలను నాశనం చేసేవాడు” అని అర్థం. ఈ ఉపవాసం త్రయోదశి తిథిలోని ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో పాటిస్తారు. ఆధ్యాత్మిక దృక్కోణంలో ఈ సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో శివుడు కైలాస పర్వతంపై తాండవం చేస్తాడని .. తన భక్తుల పిలుపును వెంటనే వింటాడని నమ్ముతారు. ప్రదోష ఉపవాసం చేయడం ద్వారా వ్యక్తి జీవితంలోని పాపాలు నశించి, మోక్షాన్ని పొందే మార్గం సుగమం అవుతుందని పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ ఉపవాసం కర్మ బంధనం నుంచి ఆత్మను విముక్తి చేసి శుద్ధి చేస్తుంది. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా, జీవితంలోని అడ్డంకులు, వ్యాధులు, శత్రు భయం, గ్రహ దోషాలు, కాల సర్ప దోషం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జాతకంలో అశుభ యోగాలు ఉన్నవారికి ఈ ఉపవాసం చాలా ఫలవంతమైనది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us