Palmistry: చేతి వేలి గోర్లు మీ లైంగిక సామర్థ్యాన్ని తెలియజేస్తాయి.. ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..

|

Aug 14, 2022 | 2:46 PM

Palmistry: గోర్లు చేతుల అందాన్ని పెంచడమే కాదు.. సాముద్రిక శాస్త్రం ప్రకారం, మీ వర్తమానం, భవిష్యత్తు గురించి ఖచ్చితమైన సమాచారాన్ని సూచిస్తాయి.

Palmistry: చేతి వేలి గోర్లు మీ లైంగిక సామర్థ్యాన్ని తెలియజేస్తాయి.. ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..
Nails
Follow us on

Palmistry: గోర్లు చేతుల అందాన్ని పెంచడమే కాదు.. సాముద్రిక శాస్త్రం ప్రకారం, మీ వర్తమానం, భవిష్యత్తు గురించి ఖచ్చితమైన సమాచారాన్ని సూచిస్తాయి. విధికి సంబంధించిన విశేషమైన వివరాలు గోళ్ల ద్వారా తెలుసుకోవచ్చని హస్తసాముద్రిక పండితులు చెబుతున్నారు. వీటితో పాటు.. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చంటున్నారు. హస్తసాముద్రికం వలె, వేలి గోళ్ల గుర్తులు, మచ్చలు, పొడవు, వెడల్పు కూడా వక్తి జీవితాన్ని తెలియజేస్తుంది. ఓవర్ వర్క్ కారణంగా కొన్నిసార్లు గోళ్లలో చిన్న చిన్న మార్పులు గమనించబడవు, కానీ ఈ మార్పులు మన జీవితానికి సంబంధించి.. వర్తమానం, భవిష్యత్తు గురించి మొత్తం సమాచారాన్ని అందిస్తాయి. మీకు కూడా గోళ్లపై ఈ సంకేతాలు కనిపిస్తే, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గోళ్లను చూడటం ద్వారా విధిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

లైంగిక బలహీనత, ఆర్థిక సంక్షోభం అంచనా..
గరుడ పురాణం ప్రకారం.. గోర్లు పసుపు రంగులో లేదా సులభంగా విరిగిపోయే వ్యక్తికి ఇతరుల కంటే తక్కువ లైంగిక శక్తి ఉంటుంది. అలాగే, గోర్లు వంకరగా, గీతలు ఉన్నవారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. గోళ్లపై మచ్చలు ఉండి, అందంగా కనిపించని వారు ఇతరులకు సేవ చేస్తూ కడుపు నింపుకుంటారు.

శారీరక బలహీనత..
గోళ్లపై తెల్లని మచ్చలు ఉన్నవారి జీవితంలో చాలా ఒత్తిడి ఉంటుందని గర్గ సంహిత చెబుతోంది. ఎముకల బలహీనతకు కూడా కారణమవుతుంది. ఒత్తిడి పెరిగే కొద్దీ ఈ మచ్చలు వస్తూ ఉంటాయి. గోళ్లపై నలుపు లేదా పసుపు మచ్చలు ఉన్నవారు విజయం కోసం చాలా కష్టపడాలి. ఆరోగ్య బలహీనతను కూడా ఇది సూచిస్తుంది. గోళ్ళపై పసుపు మచ్చలు ఉంటే రక్త హీనతను సూచిస్తుంది.

అదృష్టాన్ని సూచిస్తుంది..
గోళ్లు ఎరుపు, ప్రకాశవంతమైన గులాబీ రంగులో ఉన్నవారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వారి గోర్లు కొద్దిగా పొడుగుగా ఉండి, గులాబీ రంగును కలిగి ఉంటే, అది అదృష్టానికి సూచికగా పరిగణించబడుతుంది. మధ్య వేలు ఉంగరపు వేలు కంటే పెద్దదిగా ఉండాలి. చూపుడు వేలు మధ్య వేలు కంటే పెద్దదిగా ఉండాలి. బొటనవేలు చూపుడు వేలు కంటే పెద్దదిగా ఉండాలి. అటువంటి గోర్లు ఉన్నవారికి ఆందోళన తక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయాన్ని సాధిస్తారు.

ఆరోగ్యం ఎలా ఉంటుంది?
గోళ్లపై పొడవాటి, నిలువు గీతలు ఉంటే కీళ్ల నొప్పిని సూచిస్తుంది. చేతులతో తాకినప్పుడు గరుకుగా అనిపిస్తుంది. దీంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. అలాగే మందపాటి గోర్లు ఆర్థరైటిస్, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, తామర వంటి సమస్యలను సూచిస్తాయి.

గుండె సమస్యలు..
గోరు అంచున తెల్లటి గీత కనిపిస్తుంది. ఈ రేఖ ప్రోటీన్ లోపానికి సంకేతం. అలాగే, ఈ లైన్ మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, కాలేయ వ్యాధులకు సంబంధించినది. ఒక వ్యక్తి వేలిగోళ్లు తాబేలు వీపులా మధ్య నుండి పైకి లేచి నీలం లేదా తెలుపు మచ్చలు కలిగి ఉంటే, అది గుండె సమస్యను సూచిస్తుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల నీలం రంగు గోర్లు ఏర్పడతాయి. ఇది గుండె సమస్యలకు సంకేతంగా భావించబడుతుంది.

కష్టపడి పని చేస్తే జీవితంలో విజయం లభిస్తుంది..
గోళ్లు చాలా పెద్దగా, వంకరగా, పొడిగా ఉండి, వేలి చర్మానికి అతుక్కుని, గోళ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, అలాంటి వ్యక్తి సంతోషించే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ పని చేయడం మానేయరు. గోళ్లపై తెల్లటి మచ్చలు ఉన్నవారు జీవితాంతం కష్టపడి పనిచేస్తారు. ఫలితంగా ఆలస్యమైనా విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..