Hanuman Temple: శని దోషం ఉన్నవారికి ఈ ఆలయంలో పూజలు అత్యంత శ్రేష్టం.. స్త్రీ రూపంలో శనీశ్వరుడు..

గుజరాత్‌లోని భావ నగరం సమీపంలోని సారంగపూర్‌లో హనుమంతుని అరుదైన ఆలయం ఉంది. ఈ దేవాలయం పేరు కష్టభంజన హనుమాన్ దేవాలయం. ఇది శివుని రుద్ర అవతారమైన కష్టభంజన్ దేవ్ రూపంలో ఉన్న హనుమంతునికి సంబంధించిన అత్యంత ప్రముఖ హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం దాని వైభవం, పురాణ కథలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో హనుమంతుడు బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు.

Hanuman Temple: శని దోషం ఉన్నవారికి ఈ ఆలయంలో పూజలు అత్యంత శ్రేష్టం.. స్త్రీ రూపంలో శనీశ్వరుడు..
Lord Hanuman Temple
Follow us

|

Updated on: Sep 14, 2024 | 11:54 AM

హిందూ మతంలో శనీశ్వరుడు నవ గ్రహాల్లో ఒకడు మాత్రమే కాదు కర్మ ప్రదాతగా భావిస్తారు. శనిశ్వరుడి దృష్టి ఎవరిపైన పడితే వారి జీవితంలో సమస్యలు మొదలవుతాయని అంటారు. అయితే శనీశ్వరుడిని నిర్మలమైన మనసుతో ఆరాధిస్తే ఫలితాలు పొందుతారు. శని దోషాలు తొలగిపోతాయి. నిజానికి దేశవ్యాప్తంగా అనేక శనీశ్వరుడి ఆలయాలు ఉన్నాయి. అయితే ఒక ఆలయంలో ఆలయంలో శనీశ్వరుడు స్త్రీ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఆ దేవాలయం ఎక్కడ ఉందో ఈ రోజు తెలుసుకుందాం..

స్త్రీ రూపంలో శనీశ్వరుడి ఆలయం ఎక్కడ ఉందంటే

గుజరాత్‌లోని భావ నగరం సమీపంలోని సారంగపూర్‌లో హనుమంతుని అరుదైన ఆలయం ఉంది. ఈ దేవాలయం పేరు కష్టభంజన హనుమాన్ దేవాలయం. ఇది శివుని రుద్ర అవతారమైన కష్టభంజన్ దేవ్ రూపంలో ఉన్న హనుమంతునికి సంబంధించిన అత్యంత ప్రముఖ హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం దాని వైభవం, పురాణ కథలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో హనుమంతుడు బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. అంతేకాదు శనీశ్వరుడు హనుమంతుడి పాదాల క్రింద కనిపిస్తాడు. ఇలాంటి అరుదైన దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందుకే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో హనుమంతుడిని మహా రాజాధిరాజ అని కూడా పిలుస్తారు. ఇక్కడ హనుమంతుని విగ్రహం దగ్గర వానర సైన్యాన్ని కూడా చూడవచ్చు. అంతేకాదు శనీశ్వరుడు కూడా హనుమంతుడు పాదాల వద్ద స్త్రీ రూపంలో కూర్చుని కనిపిస్తాడు.

ఈ అరుదైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఒకానొక సమయంలో శనీశ్వరుడికి ఆగ్రహం చాలా ఎక్కువైంది. అతని కోపాన్ని ఎదుర్కోవడం భక్తులకు కష్టంగా మారింది. అటువంటి పరిస్థితిలో భక్తులు సహాయం కోసం హనుమంతుడిని అభ్యర్థించారు. భక్తుల అభ్యర్థనను విన్న హనుమంతుడు.. శనీశ్వరుడిని కట్టడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే శనీశ్వరుడు భయాందోళనకు గురయ్యాడు. హనుమంతుని కోపం నుంచి తనను తాను రక్షించుకోవడానికి స్త్రీ అవతారం ఎత్తాడు. ఎందుకంటే హనుమంతుడు బ్రహ్మచారి.. పైగా హనుమంతుడు ఏ స్త్రీపైనా చేయి ఎత్తడు కనుక శనీశ్వరుడు హనుమంతుడి నుంచి తప్పించుకోవడానికి స్త్రీ రూపం దాల్చాడు.

ఇవి కూడా చదవండి

ఇలా శని దోషాలు తొలగిపోతాయి

అటువంటి పరిస్థితిలో హనుమంతుడు వచ్చినప్పుడు.. శనీశ్వరుడు స్త్రీ రూపం ధరించి హనుమంతుడు పాదాల వద్ద కూర్చున్నాడు. ఇలా చేయడం వల్ల హనుమంతుడు శని దేవుడిని క్షమించాడు. హనుమంతుడి మన్నన పొందిన తర్వాత శనీశ్వరుడు.. హనుమంతుడి భక్తులను శని దోషం ప్రభావితం చేయదని వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి హనుమంతుడితో పాటు శనీశ్వరుడు కూడా ఈ ప్రదేశంలో పూజలు అందుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల శని దోషం తొలగి పోవడమే కాదు మనిషి జీవితంలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయాన్ని జాతకంలో శని దోషం ఉన్నవారు దర్శించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!