ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో టైగర్ నట్స్ ఎంతో కీలకంగా పనిచేస్తాయి. ఇందులోని 18 రకాల అమైనో యాసిడ్స్ గుడ్డుతో సమానమైన ప్రోటీన్‌ను అదిస్తాయి.
మెరుగైన జీర్ణక్రియకు టైగర్ బాగా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్ధకం సమస్య బలదూర్ అవుతుంది.
రక్తంలో బ్లడ్ షుగర్ పెరగకుండా చూడడంలో టైగర్ నట్స్ ఉపయోగపడతాయి. ఇది పెద్ద పేగుల్లో చక్కెర శోషణను నిరోధిస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
కడుపు నొప్పి వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చు. వీటిలోని యాంటీ బ్యాకర్టీయా గుణాలు ఇకోలి, సాల్మొనెల్లా, సెయింట్ ఆరియస్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో టైగర్ నట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్ ఇ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచేందుకు దోహదపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా టైగర్ నట్స్ ఉపయోపడతాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు త్వరగా నిండిన భావన కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో టైగర్ నట్స్ ఉపయోగపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ అనక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.