ప్రతి వ్యక్తికి జీవితంలో ఖచ్చితంగా ఏదొక రూపంలో గురువు అవసరం. మనిషిలో అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకురాగల వ్యక్తి గురువు. సత్యం , అసత్యం మధ్య తేడాను గుర్తించడం నేర్పే గురువు. అందుకనే గురువు గోవిందుడితో సమానమని చెబుతారు. గురువు లేకుండా శిష్యుడు జ్ఞానం పొందడం అసాధ్యమంటారు. మనిషి జీవితానికి సంబంధించిన జ్ఞానం గురువు ద్వారానే లభిస్తుంది. అయితే కొన్నిసార్లు కొంతమందికి అలాంటి గురువులు చాలా తేలికగా దొరుకుతారు.. కొందరికి దురదృష్టవశాత్తు చాలా కాలం వెతికినా గురువు దొరకరు. అటువంటి పరిస్థితిలో జీవితంలో తప్పొప్పుల గురించి చెప్పి.. భగవంతు గురించి జ్ఞానాన్ని అందించే నిజమైన గురువు, గుణాలు ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. మన సాంప్రదాయంలో గురువుకు అత్యుత్తమ స్థానం ఉంది. “గురుబ్రహ్మ గురుర్విష్టు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః” అని గురువుకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు. భగవంతునికంటే ముందు గురువును ఆరాధించాలని ఎందుకు చెప్పారు..మనిషిని అభివృద్ధి పథంలో పయనింపజేసే నిజమైన గురువు గురించి తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)