Dhanteras 2024: ధంతేరాస్ రోజు వీటిని కొని ఇంటికి తీసుకొస్తే.. సిరుల పంట..

|

Oct 18, 2024 | 5:41 PM

ధంతేరాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ ఈ పండుగ గురించి తెలుసు. ధంతేరాస్ రోజు ధన్వంతరీని పూజిస్తారు. ధన్వంతరీని పూజించడం వల్ల సకల ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు దూరమైన.. ఆరోగ్యంగా ఉండాలని పూజిస్తారు. ఈ ధంతేరాస్ నుంచే దీపావళి పండుకు ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 29వన ధంతేరాస్ వస్తుంది. ధంతేరాస్ రోజున చాలా మంది బంగారం, వెండి ఆభరణాలను..

Dhanteras 2024: ధంతేరాస్ రోజు వీటిని కొని ఇంటికి తీసుకొస్తే.. సిరుల పంట..
Dhanteras 2024
Follow us on

ధంతేరాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ ఈ పండుగ గురించి తెలుసు. ధంతేరాస్ రోజు ధన్వంతరీని పూజిస్తారు. ధన్వంతరీని పూజించడం వల్ల సకల ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు దూరమైన.. ఆరోగ్యంగా ఉండాలని పూజిస్తారు. ఈ ధంతేరాస్ నుంచే దీపావళి పండుకు ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 29వన ధంతేరాస్ వస్తుంది. ధంతేరాస్ రోజున చాలా మంది బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అవే కాకుండా ఇప్పుడు చెప్పే వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు. బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలను కొనలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే వాటిని కొన్నా చాలా మంచిదని, ఆర్థికంగా బలపడతారని అంటారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

తమల పాకులు:

హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టినా తమల పాకులను ఉపయోగిస్తూ ఉంటారు. తమల పాకులను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ధంతేరస్ రోజున తమల పాకులు కొని లక్ష్మీ దేవికి నైవేద్యంగా పెడితే.. ఆ జగన్మాత ఆశీస్సులు లభిస్తాయని అంటారు. ఆ తర్వాత రోజు వాటిని ఓ పవిత్ర నదిలో వదిలేయడం మంచిది.

కొత్తిమీర:

ధంతేరాస్ రోజు కొత్తిమీర కొని ఇంటికి తీసుకొచ్చినా కూడా చాలా మంచిది. కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదు.

ఇవి కూడా చదవండి

పసుపు – కుంకుమ:

పసుపు – కుంకుమలు కూడా అమ్మవారికి ప్రీతికరంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున పసుపు, కుంకుమ కొని ఇంటికి తీసుకు రావచ్చు. దీని వలన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది.

చీపురు:

ధంతేరస్ రోజున చీపుర్లు కొన్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే చీపురును కూడా లక్ష్మీ దేవితో సమానంగా భావిస్తారు. ఆ రోజున చీపురు కొని ఇంటికి తీసుకొస్తే.. ఐశ్శర్యం, అదృష్టం కలిసి వస్తుందట. ఇంట్లో గొడవలు కూడా తగ్గుతాయి. లేని వారికి చీపుర్లు, చెప్పులు, గొడుగులు కొని ఇచ్చినా మంచిదే.

ఉప్పు:

ధంతేరాస్ రోజు ఉప్పు కొన్నా చాలా మంచిది. ఉప్పును కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. ఉప్పును లక్ష్మీ దేవిగా అనుకుంటారు. అందుకే ఎవరికైనా ఉప్పును అడిగి తీసుకోరు. కాబట్టి ఈ రోజున ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినా మంచిదే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..