పవిత్ర మంత్రాలయంలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర భక్తులకు వింత అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పరిమళ ప్రసాదం రంగులు మారింది. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. శ్రీ మఠం సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు చేసి ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని జీవ సమాధి అయినటువంటి శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుంటున్నారు. పరిమళ ప్రసాదం రంగు మారడంతో వేలాదిమంది భక్తులు అవాక్కయ్యారు.
శ్రీ రాఘవేంద్రస్వామి మఠం సంప్రదాయ పద్ధతిలో చాతుర్మాసం నెలలో పరిమళ ప్రసాదం రంగు మారుతుంది. కానీ ఈ నెలలో మొదటి సారిగా కాషాయ రంగు ఉండాల్సిన ప్రసాదం ఒక్కసారిగా తెలుపు రంగు మారడంతో భక్తులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పురోహితులు సమచారం మేరకు ద్విదళ వ్రతంతో నవంబరు 12వ తేదీ వరకు తెలుపు రంగులోనే పరిమళ ప్రసాదాన్ని భక్తులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. పదుల క్వింటాళ్ల పరిమళ ప్రసాదాన్ని రవ్వ, చక్కెర, ఎండుద్రాక్ష, గోడంబి, యాలుకలు, పచ్చ కర్పూరం, కేసరి రంగు ఈ వస్తువులతో తయారు చేస్తున్నార. కానీ ఈ నెల ద్విదళ వ్రతం రావడంతో సంప్రదాయం ప్రకారం యాలుక, కేసరి రంగు, గోడంబి, ద్రాక్షలను పరిమళ ప్రసాదంలో వాడారు. కేవలం రవ్వ, చక్కెరతో తెలుపు రంగులో ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. నవంబర్ 13వ తేదీ నుండి కేసరి రంగులో ప్రసాదం ఉంటుందని శ్రీ మఠం అధికారులు తెలిపారు.